ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నాని మరియు సుధీర్ బాబు నటించిన `వి` సినిమా నుండి "వస్తున్నా వచ్చేస్తూన్నా" అనే పాటను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. శ్రేయా ఘోషల్ మరియు అమిత్ త్రివేది పాడిన ఈ పాట సుధీర్ బాబు మరియు నివేదా థామస్‌లపై చిత్రీకరించారు. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ తెలుగు థ్రిల్లర్ లో `నేచురల్ స్టార్` తొలిసారిగా నెగెటివ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. సుధీర్ బాబు, నివేదా థామస్ మరియు అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించారు.

సిరివెన్నెల సీతరామశాస్త్రి రాసిన తన అద్భుతమైన సాహిత్యంతో ఇద్దరి మధ్య ప్రేమను ఆవిష్కరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్‌ వస్తోంది.  కథ విషయానికి వస్తే ఒక క్రైమ్ రచయితతో ప్రేమలో పడిన ఒక పోలీసు, ఎంతో ఆనందంతో నిండిన అతని జీవితంలో, ఒక కిల్లర్ ప్రవేశించడంతో, అతనికి ఎదురయిన ఒక పజిల్‌ను పరిష్కరించడం కోసం ఎదుర్కొంటున్న సవాళ్లతో ఆయన జీవితం కొత్త మలుపులు తీసుకుంటుంది.

ఈ సినిమా నానికి పరిశ్రమలో 25 వ చిత్రంతో పాటు విలన్ గా నటించిన మొదటి చిత్రం. భారతదేశంలో మరియు 200 దేశాల్లో మరియు టెర్రిటోరియాస్ లో ఉన్న ప్రైమ్ సభ్యులు సెప్టెంబర్ 5 న విడుదల అవుతున్న 'వి' డిజిటల్ ప్రీమియర్‌ను ఎంజాయ్‌ చేయోచ్చు.