Asianet News TeluguAsianet News Telugu

దిగివచ్చిన 'అమెజాన్‌ ప్రైమ్‌' ,క్షమాపణలతో వీడియో

అమెజాన్ ప్రైమ్ తొలిసారి దిగివచ్చి క్షమాపణ చెప్పింది.  ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. ఎంతో పెద్ద సంస్ద, నెంబర్ వన్ ఓటీటి, ప్రపంచ వ్యాప్త సబ్ స్కైబర్స్ అన్ని ప్రక్కన పెట్టి...క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. తాము ఏం చూపెట్టినా చెల్లుతుందనే సొంత వాదనకు చెక్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఓ వర్గ ప్రజాగ్రహానికి తల వొంచక తప్పలేదు. ఇండియానే కదా అని చిన్న చూపు చూడటానికి వీల్లేదని అర్దం చేసుకుంది. తాము స్ట్రీమింగ్ చేసిన వెబ్ సీరిస్ కు సంభందించి ఇదంతా చెయ్యాల్సి వచ్చింది. ఆ సీరిస్ లోని అభ్యంతరకరమైన సీన్లను ఎడిట్ చేసింది.

Amazon Prime Video apologises unconditionally for Tandav jsp
Author
Hyderabad, First Published Mar 3, 2021, 6:53 PM IST

అమెజాన్ ప్రైమ్ తొలిసారి దిగివచ్చి క్షమాపణ చెప్పింది.  ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. ఎంతో పెద్ద సంస్ద, నెంబర్ వన్ ఓటీటి, ప్రపంచ వ్యాప్త సబ్ స్కైబర్స్ అన్ని ప్రక్కన పెట్టి...క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. తాము ఏం చూపెట్టినా చెల్లుతుందనే సొంత వాదనకు చెక్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఓ వర్గ ప్రజాగ్రహానికి తల వొంచక తప్పలేదు. ఇండియానే కదా అని చిన్న చూపు చూడటానికి వీల్లేదని అర్దం చేసుకుంది. తాము స్ట్రీమింగ్ చేసిన వెబ్ సీరిస్ కు సంభందించి ఇదంతా చెయ్యాల్సి వచ్చింది. ఆ సీరిస్ లోని అభ్యంతరకరమైన సీన్లను ఎడిట్ చేసింది.

వివరాల్లోకి వెళితే...సైఫ్‌ అలీఖాన్‌ నటించిన ‘తాండవ్‌’ మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.  తాండవ్ హిందువుల విశ్వాసాలకు భంగం కలిగించేలా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. తాండవ్ లో బాలీవుడ్ అగ్రహీరోలలో ఒకడైన సైఫ్ అలీఖాన్ నటించాడు ఈ సిరీస్ హిందూ దేవతలను కించపరిచేలా ఉందంటూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పలు చోట్ల పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అధికార బీజేపీ కూడా అమెజాన్ ఉద్దేశపూర్వకంగానే హిందూ మనోభావాలను దెబ్బ తీసిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే అమెజాన్ బేషరతుగా క్షమాపణలు చెప్పింది. అమెజాన్ అపాలజీస్  అంటూ విడుదల చేసిన ఒక ప్రకటనలో తాండవ్ లోని కొన్ని సీన్లు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నందున బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొంది.  

ఈ వెబ్ సిరీస్‌ హిందువుల మనోభావాలకు భంగం కలిగించిందనే ఆరోపణలకు, ఆ షోలో నటించిన నటీనటులు, సిబ్బంది క్షమాపణలు చెప్పారు. కొంతమంది హిందూ రాజకీయ నేతలు ఈ షోను తొలగించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను, 'హౌస్ ఆఫ్ కార్డ్స్' అనే సూపర్ హిట్ షో ఆధారంగా తీశారు. విమర్శలు ఎదుర్కుంటున్న సీన్ లో యూనివర్సిటీలో వేసే ఒక డ్రామా సన్నివేశం కూడా ఉంది. అందులో శివుడి వేషంలో ఉన్న ఒక పాత్ర ' స్వాతంత్ర్యం' గురించి మాట్లాడుతుంది. ఇది వివాదాస్పదమైంది.  

ఉత్తర ప్రదేశ్ లోని ఒక పోలీసు స్టేషన్లో నమోదైన కేసులు సంబంధించి గత వారం అమెజాన్ ఉన్నతాధికారిని గంటల తరబడి విచారించడంతో తాండవ్ వివాదం తార స్థాయికి చేరింది.  దీంతో అమెజాన్ దిగివచ్చి క్షమాపణ చెప్పింది. అయితే అమెజాన్ క్షమాపణలకు చెప్పినా కేసు విచారణ కొనసాగుతుందని యూపీ పోలీసు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఇందులోని కొన్ని దృశ్యాల కారణంగా బాధపడిన వారికి బేషరతుగా క్షమాణలు చెబుతున్నామని ఆ సంస్థ తెలిపింది. తన ప్రేక్షకుల నమ్మకాలు, మనోభావాలను గౌరవిస్తామని పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios