మలయాళ స్టార్ హీరోలు ఫహద్‌ ఫాజిల్‌, రోషన్‌ మాథ్యు, దర్శన రాజేంద్రన్‌ లు ప్రధాన పాత్రల్లో మహేష్ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సీయూ సూన్‌. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్ అయిన సుఫియా సుజాతయమ్‌ సూపర్‌ హిట్ అయిన తరువాత అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్ అవుతున్న మరో మలయాళ సినిమా సీయూ సూన్‌.

గ్రిప్పింగ్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే కేరళకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను దుబాయ్‌ లో ఉండే తన బంధువుల ఇంట్లో తప్పిపోయిన వ్యక్తిని వెతికే పనికి నియమిస్తారు. ఈ సినిమాను కరోనా పరిస్థితుల్లో ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చిత్రీకరించారు. `మహేష్‌తో కలిసి పనిచేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. గతంలో మా కాంబినేషన్‌లో వచ్చిన టేక్ హాఫ్‌ సినిమాతో మా మధ్య బంధం మరింత బలపడింది` అని తెలిపాడు ఫహద్‌ ఫాజిల్‌.

సీయు సూన్‌ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్‌ డ్రామా థ్రిల్లర్‌. గతంలో ఇలాంటి కాన్సెప్ట్‌ తో వచ్చిన ఇండియని సినిమాలు చాలా తక్కువ. ప్రస్తుతం ప్రజలు డిజిటల్‌గా కనెక్ట్‌ అయి ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే మేం కూడా మామ సినిమాను  ప్రదర్శించేందుకు డిజిటల్ వేదికను ఎంచుకున్నాం. వేల టీవీ షోలు, సినిమాలు అందుబాటులో ఉన్న అమెజాన్‌లో మా సినిమా విడుదల అవుతోంది` అంటూ చెప్పారు దర్శకుడు మహేష్‌.