ప్రభాస్ ఇమేజ్ రేంజ్ దేశ సరిహద్దులు కూడా దాటిపోయింది. జపాన్ వంటి దేశాల్లో ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాధే శ్యామ్, సలార్ మరియు ఆదిపురుష్ చిత్రాలతో పాటు,  దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. దేశవ్యాప్తంగా మార్కెట్ కలిగిన ప్రభాస్ సినిమాల కోసం ఓటిటి సంస్థలు కూడా అదే స్థాయిలో ఎగబడుతున్నాయని సమాచారం. 


తాజాగా పరిశ్రమలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ఏకంగా సలార్ కి వంద కోట్ల ఆఫర్ ఇచ్చిందట.  సలార్ అన్నీ భాషల వెర్షన్స్ కి కలిపి వంద కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఓటిటి హక్కులకు వంద కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. దేశంలో ఇంత వరకు ఏ చిత్రానికి ఇంత పెద్ద మొత్తంలో చెల్లించిన దాఖలాలు లేవు. మరి ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ సరికొత్త రికార్డు నమోదు చేసినట్లు అవుతుంది. 


దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవలే సలార్ షూటింగ్ మొదలుపెట్టారు. తెలంగాణా రాష్ట్రంలోని గోదావరి ఖని మైనింగ్ ఏరియాలో సలార్ షూటింగ్ జరిగింది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. కెజిఎఫ్ నిర్మాతలు సలార్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. 2022 సమ్మర్ కానుకగా సలార్ విడుదల కానుంది.