Asianet News TeluguAsianet News Telugu

KGF 2 :అమేజాన్ 'పే పర్ వ్యూ' కి ఈ రకంగా దారణంగా దెబ్బ కొడుతున్నారు

సైలెంట్ గా సినిమాని స్ట్రీమింగ్ కి పెట్టేసి అదనంగా డబ్బులు వసూలు చేయడం ఏమీ బాగాలేదని ఇదొక పనికిమాలిన చర్య అని అమెజాన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.  

Amazon Prime KGF 2 OTT Plan Mocked
Author
Hyderabad, First Published May 17, 2022, 4:44 PM IST

 యష్ నటించిన సంచలన చిత్రం 'కేజీఎఫ్ 2'. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. వసూళ్ల పరంగా క్రేజీ చిత్రాలని సైతం వెనక్కి నెట్టి వాటి రికార్డుల్ని తుడిచిపెడుతూ ప్రభంజనాన్ని సృష్టించింది. చాప్టర్ 1ని మించి చాప్టర్ 2 వుండటంతో 'కేజీఎఫ్ 2' కు దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు బ్రహ్మరథం పట్టారు.   కేజీఎఫ్ 2 ఊహించిన దానికి మించి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించటంతో ఈ సినిమాని ఓటీటిలోనూ క్యాష్ చేసుకోవాలని  ప్లాన్ చేసారు. 

ఈ సినిమాని ఐదు భాషల్లో స్ట్రీమింగ్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే ఆ మొత్తాన్ని రాబట్టడం కోసం కొత్త ప్లాన్ ని అమల్లోకి తీసుకొచ్చింది.  pay per view విధానాన్ని 'కేజీఎఫ్ 2'లో ప్రవేశ పెట్టి వినియోగదారులకు గట్టి షాకిచ్చింది. వన్ ఇయర్ సబ్స్ స్క్రిప్షన్ రూ. 1499 పే చేసినా సరే 'కేజీఎఫ్ 2'ని చూడాలంటే రూ. 199 అదనంగా చెల్లించాల్సిందే అంటూ కొత్త రూల్ ని అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ నేపధ్యంలో  చడీ చప్పుడు లేకుండా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ ని స్టార్ట్ చేసి షాకిచ్చింది. చాలా రోజులుగా థియేటర్ కు వెళ్లని వీక్షకులు ఈ మూవీని ఓటీటీలో చూడాలని భావించారు. అయితే వారికి అమెజాన్ ప్రైమ్ ఊహించని షాకిచ్చినట్లైంది. దీనిపై వీక్షకులు నెటిజన్స్ మండిపడుతున్నారు. సైలెంట్ గా సినిమాని స్ట్రీమింగ్ కి పెట్టేసి అదనంగా డబ్బులు వసూలు చేయడం ఏమీ బాగాలేదని ఇదొక పనికిమాలిన చర్య అని అమెజాన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఆమెజాన్ పే పర్ వ్యూ విధానం దారుణంగా ఫెయిల్ అయిందని అంటున్నారు. సోషల్ మీడియా నిన్నటి నుంచి ఈ విషయమై హోరెత్తిపోతోంది.

ఈ నేపధ్యంలో చాలా మంది వన్ ఇయర్ సబ్స్ స్క్రిప్షన్ రూ. 1499 పే చేసినా అదనంగా రూ. 199 ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నిస్తున్నారు.  అలాగే  అమెజాన్ ప్రైమ్ కు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా దిమ్మదిరిగే కామెంట్స్ చేయటం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. పే పర్ వ్యూ విధానంలో కాకుండా సినిమాని వివిధ ప్లాట్ ఫామ్ లలో డౌన్ లోడ్ హె చ్ డీ ప్రింట్ లింక్స్ లభిస్తుండటంతో ఇల్లీగల్ గా ఈ మూవీని డౌన్ లోడ్ చేసుకుంటూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా అకౌంట్ కు లింగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇల్లీగల్ డౌన్ లోడ్స్ ని ఎలా ఆపాలో తెలియక అమెజాన్ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయట.  దాంతో  అమెజాన్ 'కేజీఎఫ్ 2' స్ట్రీమింగ్ ని స్టార్ట్ చేసి బలవంతంగా వినియోగదారుల నుంచి పే పర్ వ్యూ విధానం ద్వారా అదనంగా డబ్బులు దండుకోవాలన్న ప్లాన్ దారుణంగా ఫ్లాప్ అయింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios