Asianet News TeluguAsianet News Telugu

Pushpa OTT: 'పుష్ప' ఓటీటీ వెర్షన్ లో ఆ సీన్స్ లేవు,ఫ్యాన్స్ నిరాశ?

 రాత్రి 8 గంటల నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అయ్యింది.సూపర్‌ హిట్‌ టాక్‌ తెచుకున్న పుష్ప చిత్రాన్ని 90 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ముందుగా భావించినా సంక్రాంతి సీజన్‌  క్యాష్‌ చేసుకునేందుకు రెడీ అయ్యింది.
 

Amazon OTT Disappoints With Pushpa Uncut Version
Author
Hyderabad, First Published Jan 8, 2022, 9:16 AM IST


ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా క్లోజింగ్‌ కలెక్షన్స్‌లోనూ అదిరిపోయే వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌17న విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికే  ప్రపంచ వ్యాప్తంగా రూ. 300కోట్ల ట్రేడ్‌ మార్క్‌ను దాటేసిన పుష్ప సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ప్రముఖ ఓటీటీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా నిన్న (జనవరి 7)న ఈ చిత్రం రిలీజ్‌ అయ్యింది. రాత్రి 8 గంటల నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అయ్యింది.సూపర్‌ హిట్‌ టాక్‌ తెచుకున్న పుష్ప చిత్రాన్ని 90 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ముందుగా భావించినా సంక్రాంతి సీజన్‌  క్యాష్‌ చేసుకునేందుకు రెడీ అయ్యింది.


 అంతవరకూ బాగానే ఉన్నా...ఈ ఓటీటి వెర్షన్ పై ఫ్యాన్స్ చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. అన్ కట్ వెర్షన్ వస్తుందని భావించారు. సినిమాలో లేని కొన్ని సీన్స్ కలిసి ఓటీటి వెర్షన్ వస్తోందని మీడియాలో, సోషల్ మీడీయాలో ప్రచారం జరిగింది. అయితే ఒకే ఒక డిలేటెడ్ సీన్ కలిపారు. ఆ సీన్ కూడా ఆల్రెడీ యూట్యూబ్ లో రిలీజైందే. దాంతో రెండో సారి చూద్దామని ఫిక్సైన సగటు అభిమానికి కొంత నిరాశకలిగింది. ఫుల్ లెంగ్త్ అన్ కట్ వెర్షన్ వస్తుందనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. థియేటర్ లో రిలీజైన వెర్షనే ..ఓటిటీలోనూ స్ట్రీమ్ అవుతోంది. మరికొన్ని డిలేటెడ్ సీన్స్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 

ఓటీటీ దిగ్గజమైన అమెజాన్ ప్రైమ్ దాదాపుగా రూ. 27కోట్ల నుంచి రూ.30కోట్లకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ‘‘ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులకు అంత కంటే ఎక్కవ ధరే లభించింది. అమెజాన్‌లో ఈ సినిమా 4 భాషల్లో (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) అందుబాటులో ఉంది . ‘‘ పుష్ప’’ డిసెంబర్ 17, 2021న థియేటర్లల్లో విడుదల అయింది. సినిమా విడుదలయిన 21రోజుల్లకే ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమ్ కాబోతుండటం విశేషం. ఈ సినిమాలో రష్మిక మందన్న, సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 
Also Read : Samantha Item Song: దుమ్ములేపుతున్న సమంత `ఊ అంటావా ` సాంగ్‌.. పూర్తి వీడియో సాంగ్‌ రిలీజ్‌
పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఒన్ మేన్ షో చేశాడు. రాయలసీమ డిక్షన్, పుష్పరాజ్ గా అతడి పెర్ఫార్మెన్స్ నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగింది. ఇంతకు ముందు అల్లు అర్జున్ ను ఇలాంటి పాత్రలో చూసి ఉండని అభిమానులకి ఈ సినిమా .. ప్రీరిలీజ్ ఈవెంట్ లో  సునీల్ అన్నట్టు నిజంగా పెళ్ళి తర్వాత వచ్చే రిసెప్షన్ భోజనం లాంటిదే అనిపించింది. 
Also Read : Trisha : ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న కరోనా.. హీరోయిన్ త్రిషకు కోవిడ్ పాజిటివ్.

Follow Us:
Download App:
  • android
  • ios