వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’. సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్. కార్తిక్ రత్నం, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు నిర్మాణాంతర పనులు ముగించుకుని రిలీజ్ కు ముస్తాబు అయ్యింది.
లాక్ డౌన్ ఎత్తేసాక తెలుగు సినిమాలు థియోటర్స్ లో వరస రిలీజ్ లు అవుతాయని అందరూ భావించారు. కానీ రివర్స్ లో జరుగుతోంది. చాలా పెద్ద నిర్మాతలు తమ సినిమాలు డైరక్ట్ ఓటీటిలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని చర్చలు మొదలెట్టారు. థియోటర్స్ తిరిగి మొదలవుతున్న ఈ నేపధ్యంలో డెల్టా వేరియెంట్ తో మళ్లీ లాక్ డౌన్ పెడతారనే భయాలు మొదలయ్యాయి. దాంతో ఇంక ఓటీటిలే దిక్కు అని నిర్ణయానికి వచ్చేస్తున్నారు. నితిన్ మాస్ట్రో సినిమా తర్వాత ఇప్పుడు వెంకటేష్ నారప్ప సైతం ఓటీటి డీల్ ని క్లోజ్ చేసుకున్నట్లు సమాచారం.
ఇంతకు ముందు నారప్ప కేవలం థియేటర్ రిలీజ్ మాత్రమే అని చెప్పిన నిర్మాత సురేష్ బాబు నిర్ణయం మార్చుకుని డైరక్ట్ ఓటిటి రిలీజ్ వైపు ప్రయాణం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ మేరకు అమేజాన్ ప్రైమ్ తో డైరక్ట్ రిలీజ్ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అఫీషియల్ గా ప్రకటన అయితే ఇప్పటిదాకా లేదు.
స్టార్ హీరో వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి నిర్ణయించిన మేరకు మే 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా ఉన్న దారుణ కరోనా పరిస్థితుల రీత్యా ‘నారప్ప’ విడుదలను వాయిదా వేసారు. ఇప్పుడు డైరక్ట్ ఓటిటి రిలీజ్ పెట్టారు.
‘‘తమిళంలో విజయవంతమైన ‘అసురన్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్నాం. వెంకటేష్ రెండు విభిన్నమైన అవతారాలలో మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తారు. ఆయన భార్య సుందరమ్మగా ప్రియమణి గుర్తుండిపోయే పాత్ర చేస్తోంది. తాజాగా నిర్మాణాంతర పనులు పూర్తయ్యాయి. వారం రోజుల్లో తొలి కాపీ రెడీ అవుతుంది. త్వరలో కొత్తవిడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాం’’ అని చెప్పారు చిత్ర నిర్మాతలు.
సమాజంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న కుల వ్యవస్థ, దానివల్ల ఎదురయ్యే సమస్యలు గురించి తెలియజేసే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు.
