సారాంశం

అమర్ దీప్ కు సపోర్ట్ గా తన భార్య తేజస్వీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఫినాలే అస్త్రా టాస్క్ లో అమర్ పై ప్రియాంక  చూపించిన కోపానికి ఆమె కౌంటర్ ఇచ్చారు.  

బిగ్ బాస్  తెలుగు సీజన్ 7 డిఫరెంట్ గా కొనసాగుతోంది. ఆరోసీజన్ అట్టర్ ప్లాప్ అవ్వడంతో..ఇక ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రారంభించారు. ఇందులో ఎవరూ ఊహించని ట్విస్ట్ లు..  కొత్త కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో  ఎన్నో ట్విస్టుల మీద ట్విస్ట్ లతో పాటు..  సర్‌ప్రైజ్‌లు ఎక్కువగా ఇస్తూ.. షాకులిస్తున్నారు బిగ్ బాస్. అంతే కాదు ఎవరూఊహించని విధంగా..  షాకింగ్ ఎలిమినేషన్లు కూడా ఈసీజన్ లోనే చూస్తున్నాం. 

దాంతో బిగ్ బాస్ పై జనాల్లో ఆసక్తి ఇంకా పెరింది. అంతే కాదు ఆరో సీజన్ అట్టర్ ప్లాన్అయితే.. ఏడో సీజన్ సూపర్ హిట్ అయ్యింది. ఈక్రమంలో సీరియల్ బ్యాచ్ ను ఎక్కువగా తీసుకోవడంతో...ఫ్యామిలీఆడియన్స్ కూడా ఇటు వైపు షిప్ట్ అయ్యాయు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా 13వ వారం  నడుస్తోంది. అయితే ఈ సీజన్ లో స్టార్ మా బ్యాచ్ అని పిలువబడే అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వచ్చారు.

వీళ్లు మొదటి నుంచి కూడా కలిసి అడుతున్నారని ప్రేక్షకులందరి అర్ధం అయింది. 13వ వారం వచ్చిన కూడా వాళ్లు కలిసే అడుతున్నారు. నాగార్జున కూడా వాళ్లను సీజన్ మొత్తం కూడా కలిసే అడతారని అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ తరవాత వారంలో వీళ్ల మధ్య గోడవలు పెట్టే గేమ్స్ బిగ్ బాస్ పెట్టారు. 

అయితే బిగ్ బాస్ ఊహించినట్లే వారి మధ్య గోడవలు జరిగాయి. ప్రియాంక- అమర్ మధ్య శోభ చిచ్చు పెట్టింది. ఫినాలే అస్త్రలో భాగంగా జరిగిన సంఘటన కారణంగా ప్రియాంక అమర్ శత్రువులుగా మారారు. ప్రియాంక సీరియల్ బ్యాచ్ నుంచి దూరం అయ్యింది. ఈక్రమంలో ఫినాలే అస్త్రాలో ఓడిపోయిన ప్రియాంక తన పాయింట్స్ ను అమర్ కు కాకుండా గౌతమ్ కు ఇవ్వడం అమర్ ను బాగా బాధించింది. ఆ బాధకు శోభ ఇంకాస్త పెట్రోల్ పోసింది. 

అయితే ఫినాలే అస్త్ర ను సాధించి మొదటి ఫైనలిస్ట్ గా అర్జున్ అంబటి నిలిచాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినా.. ఆటతీరుతో ఆకట్టుకుంటూ.. అర్జున్ ఫైనల్స్ కు చేరాడు. ఇక ఈ టాస్క్ లో  ప్రియాంక ఓడిపోయి మొదటి నుండి కలిసి ఉన్న అమర్ దీప్ కి ఇవ్వకుండా గౌతమ్ తనని కెప్టెన్ ని చేసాడు కాబట్టి, ఆయనకీ ఈమె పాయింట్స్ ఇవ్వాలి అనుకోవడం లో ఎలాంటి తప్పు లేదు. కానీ రెండో సారి కూడా అర్జున్ కి ఇవ్వాలని అనుకోవడం చాలా తప్పు అంటు నెటిజన్లు కామంట్స్ చేశారు. 

మొదటి వారం నుండి కలిసి మెలిసి ఉన్న స్నేహితుడైన అమర్ దీప్ కనీసం తనకి రెండవ ఛాయస్ గా కూడా కనిపించలేదా అని అమర్ ఫ్యాన్స్ ఎంతగానో ఫీల్ అయ్యారు.అమర్ కూడా ఈ విషయం పై చాలా డీప్ గా హర్ట్ అయ్యాడు. దీనికి ఇంస్టాగ్రామ్ లో అమర్ దీప్ ఫ్యాన్స్ జరిగిన వీడియో మొత్తాన్ని పోస్ట్ చెయ్యగా, దానిని అమర్ దీప్ భార్య తేజస్విని తన స్టోరీ లో అప్లోడ్ చేసింది. 

అంతే కాదు.. తన భర్తను సపోర్ట్ చేస్తూ.. ధైర్యం చెపుతూ.. బలంగా నిలబడు..ఇప్పటికైనా మనుషులు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకో’ అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.