Bigg Boss Telugu 7: పోటుగాళ్ల ముందు ఆటగాళ్లు డీలా.. వెర్రిపప్ప అయిన అమర్‌దీప్.. ఈవారం నామినేటైంది వీరే!
ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్‌లో ఓ కొలిక్కి వచ్చింది. అదే సమయంలో సీక్రెట్ రూమ్‌లో ఉన్న గౌతమ్ కృష్ణ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశాడు.

బిగ్ బాస్ తెలుగు 7 ఆరోవారం వినోదాత్మకంగా తీసుకెళ్తున్నాడు బిగ్ బాస్. మంగళవారం ఆట మొత్తం ఎంటర్టైనింగ్‌గానే సాగింది. మొదట నామినేషన్ల ప్రక్రియని ఫైనల్ చేశాడు. ముందుగా పోటుగాళ్లు నామినేట్ చేయగా, ఆ తర్వాత ఆటగాళ్లు నామినేట్ చేశారు. ఇందులో అమర్‌దీప్, యావర్, సందీప్, తేజ, శోభాశెట్టి, నయని పావని, అశ్విని, పూజా నామినేట్ అయ్యారు. అయితే అప్పుడే సీక్రెట్ రూమ్‌లో ఉన్న గౌతమ్ కృష్ణని హౌజ్‌లోకి తీసుకొచ్చారు బిగ్‌బాస్. గౌతమ్ రావడంతో అంతా సర్‌ప్రైజ్‌తోపాటు హ్యాపీ అయ్యారు.
అయితే గౌతమ్‌కి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయోచ్చు, లేదంటే కొత్తగా ఎవరినైనా నామినేట్ చేయోచ్చు. దీంతో గౌతమ్.. శివాజీ, ప్రియాంకలకు క్లాస్ పీకాడు. గతంలో వాళ్లు చేసిన కామెంట్లకి ఆయన ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత కూల్ అయి నామినేట్ అయిన సందీప్‌ని సేవ్ చేశాడు. దీంతో ఆరో వారం అమర్ దీప్, యావర్, తేజ, శోభా శెట్టి, నయని పావని, అశ్విని, పూజా నామినేట్ అయ్యారు.
అనంతరం ఇంటి సభ్యులకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో తమ ఫిట్‌నెస్‌ని చాటుకోవాల్సింది. అందుకోసం స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న నెంబర్లు, గార్డెన్‌లో ఉన్న టైర్లని నెంబర్‌తో మ్యాచ్ చేసి పూల్‌లో ఉన్న కడ్డీకి తగిలించారు. బజర్ మోగే సమయంలో ఎవరు ఎక్కువ టైర్లు పెడతారో వారు విన్నర్. ఇందులో ఉత్కంఠభరితంగా సాగినా ఈ గేమ్‌లో పోటుగాళ్లు(కొత్తగా వచ్చిన వాళ్లు) విన్నర్‌గా నిలిచారు. అనంతరం జీనియస్ గేమ్ పెట్టారు. ఇందులో పోటుగాళ్ల నుంచి గౌతమ్, ఆటగాళ్లనుంచి అమర్ దీప్‌ని పెట్టారు. అమర్ దీప్ అన్నీ చెప్పలేకపోయాడు, తప్పులు చెప్పారు. దీంతో మధ్యలో ఆటగాడిని మార్చుకోవాల్సి వచ్చింది. తేజ ఆ స్థానంలో వచ్చాడు. కానీ ఈ టాస్క్ చాలా ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ఆద్యంతం నవ్వులు పూయించింది. కానీ గౌతమ్ ఎక్కువగా చెప్పి పోటుగాళ్ల టీమ్‌ని గెలిపించారు. ఇలా రెండు టాస్క్ ల్లోనూ పోటుగాళ్లు గెలిచారు.
దీంతోపాటు మధ్యలో రాత్రి సమయంలో దొంగతనం ఎపిసోడ్ ఆకట్టుకుంది. సందీప్, తేజలు దొంగతనం చేయడం ఫన్నీగా సాగింది. మరోవైపు యావర్‌కి బిగ్ బాస్ క్లాస్ పీకాడు. ఇంకా తెలుగు ఇంప్రూవ్ కాలేదని, అందుకు యావర్‌కి అశ్వినిని తెలుగు ట్రాన్స్ లేటర్గా పెట్టారు. ఇలా ఈ రోజు ఎపిసోడ్‌లో చాలా వరకు ఫన్నీ ఇన్స్ డెంట్స్ చోటు చేసుకున్నాయి. ఆద్యంతం వినోదాన్ని పంచాయి.