Asianet News TeluguAsianet News Telugu

నాకేం తెలుసు బొచ్చు, పిచ్చి పట్టినట్లు రెచ్చిపోయిన అమర్.. నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది నేనే అంటూ శోభా హింట్

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో గురువారం ఎపిసోడ్ 96 అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఓట్ అప్పీల్ గేమ్ లో ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదాలు, ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి.

Amardeep and Pallavi Prashanth fight in bigg boss telugu 7 became hot topic dtr
Author
First Published Dec 7, 2023, 10:45 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో గురువారం ఎపిసోడ్ 96 అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఓట్ అప్పీల్ గేమ్ లో ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదాలు, ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. యావర్ వర్సస్ శోభా శెట్టి.. ప్రశాంత్ వర్సస్ అమర్ దీప్ అన్నట్లుగా సాగింది ఫైట్. 

ముందుగా ఈ రోజు అర్జున్ కి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. దీని కోసం అమర్, అర్జున్ పోటీ పడగా ప్రియాంక, శోభా శెట్టి మినహా మిగిలిన వాళ్లంతా అర్జున్ కే సపోర్ట్ చేశారు. దీని తర్వాత ప్రియాంకతో శోభా శెట్టి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. శివాజీ గురించి శోభా మాట్లాడుతూ.. వీళ్లంతా నేను బాటమ్ 2 లో ఉన్నాను.. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది నేనే అనుకుంటున్నారు. 

అయినా పర్వాలేదు.. వెళ్లేముందు శివాజీ గురించి అన్ని విషయాలు బయటపెట్టే వెళతాను. ప్రజలు చూసుకుంటారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతలో మరో ఓట్ అప్పీల్ గేమ్ మొదలయింది. బుట్టలో ఉన్న బంతుల్ని కంటెస్టెంట్స్ ధరించిన జాకెట్స్ కి అతుక్కునేలా విసరాలి. గేమ్ ముగిసే సమయానికి ఎవరి జాకెట్ కి ఎక్కువ బంతులు అతుక్కుని ఉంటే వారు అవుట్. 

మొదటి రౌండ్ లో నాటకీయంగా శోభా శెట్టి, యావర్ అవుట్ అయ్యారు. ఇద్దరూ ఫిజికల్ గా ఒకరికి ఒకరు బంతులు నటించుకున్నారు. ఈ క్రమంలో లైన్ దాటి వెళ్లడంతో ఇద్దరూ అవుట్ అయ్యారు. శోభా శెట్టి ఎప్పుడు చూసినా తననే టార్గెట్ చేస్తోందని యావర్ అసహనం వ్యక్తం చేశాడు. దీనితో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శోభా ముందు యావర్ ఛీ ఛీ అనడంతో గొడవ మరింత ఎక్కువైంది. 

Also Read: అందరి ముందు యాంకర్ ప్రదీప్ పెళ్లి మ్యాటర్ లీక్ చేసిన నాని.. దెబ్బకు దండం పెట్టేశాడు..

ఆ తర్వాతి రౌండ్ కి వెళ్ళిద్దరే సంచాలకులుగా వ్యవహరించారు. ఈ రౌండ్ లో అమర్, ప్రశాంత్ మధ్య రచ్చ మొదలైంది. ఇద్దరూ ఫిజికల్ గా ఒకరినొకరు తోసుకుంటూ గొడవ పడ్డారు. లైన్ దాటడంతో ఇద్దరూ అవుట్ అయ్యారు. తనని అమర్ దీప్ నెట్టేశాడని అంతేకాక చేతిపై కొరికాడని ప్రశాంత్ కంప్లైంట్ చేశాడు. ఈ క్రమంలో అమర్ దీప్ టెంపర్ లూజ్ అయ్యాడు. పాత విషయాలు తీస్తూ ఇద్దరూ రెచ్చిపోయారు. ఒక సందర్భంలో అమర్ నాకేం తెలుసు బొచ్చు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలే చేశాడు. నాకు నీవల్ల ఇచ్చి పడుతోంది అంటూ అమర్ నిజంగానే పిచ్చి పట్టిన వాడిలా కోపంగా ఊగిపోతూ చేసిన ప్రవర్తన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

Also Read: కేశవకి బెయిల్ రాకుంటే పుష్ప 2 పరిస్థితి ఏంటి.. అల్లు అర్జున్, సుకుమార్ కి ఊహించని చిక్కులు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios