MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anchor Pradeep: అందరి ముందు యాంకర్ ప్రదీప్ పెళ్లి మ్యాటర్ లీక్ చేసిన నాని.. దెబ్బకు దండం పెట్టేశాడు..

Anchor Pradeep: అందరి ముందు యాంకర్ ప్రదీప్ పెళ్లి మ్యాటర్ లీక్ చేసిన నాని.. దెబ్బకు దండం పెట్టేశాడు..

యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఇచ్చి నానిని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడగాలని ప్రయత్నించాడు. కానీ నాని దెబ్బకు ప్రదీప్ ఇరుక్కుపోయాడు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 07 2023, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ తో పాటు ఆకట్టుకునే ప్రేమ కథతో కూడా ఈ చిత్రం డిసెంబర్ 7న అంటే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి హాయ్ నాన్న చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఫ్యామిలీ ఆడియన్స్ లీనమైపోయి ఎంజాయ్ చేసే ఎమోషనల్ చిత్రం అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. నాని ప్రచార కార్యక్రమాలన్నీ తన భుజంపై వేసుకుని బిజీ బిజీగా గడుపుతున్నాడు. హాయ్ నాన్న ప్రమోషన్స్ కోసం నాని ఢీ ప్రీమియర్ లీగ్ గ్రాండ్ ఫినాలేకి అతిథిగా హాజరయ్యారు. 

36

మృణాల్ ఠాకూర్ కూడా ఢీ ప్రీమియర్ లీగ్ షోలో మెరిసింది. ఇద్దరూ కలసి ఢీ షోలో మంచి ఫన్ క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. నేచురల్ స్టార్ నానికి ఢీ టీమ్ దసరా బిజియంతో హర్షధ్వానాలతో స్వాగతం పలికింది. 

46

నాని ఎంట్రీ ఇవ్వగానే హైపర్ ఆది తనదైన విధంగా పంచ్ డైలాగులతో ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలో నాని అన్న సాధించిన అఛీవ్మెంట్ ఏంటంటే.. ప్రతి ఇంట్లో అమ్మ వాళ్ళ కొడుకుతో ఒక్కసారి అయినా నాని సినిమా పెట్టమని అడిగి ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు వర్త్ వర్మా వర్త్ అంటూ హైపర్ ఆది నానిపై పొగడ్తల వర్షం కురిపించాడు.  

56

ఇక యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఇచ్చి నానిని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడగాలని ప్రయత్నించాడు. కానీ నాని దెబ్బకు ప్రదీప్ ఇరుక్కుపోయాడు. వచ్చే ఏడాది నీ పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది నిజామా అని నాని.. ప్రదీప్ ని ప్రశ్నించాడు. నా పెళ్లి గురించి పదేళ్ల నుంచి రూమర్స్ వస్తున్నాయి అన్న అనిప్రదీప్ తెలిపాడు. 

66

లేదు ప్రదీప్.. ఈ రూమర్ చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి వచ్చింది.. త్వరలోనే నీ పెళ్లి జరగబోతోంది అట కదా అని నాని అన్నాడు. ఎవరు రూమర్స్ క్రియేట్ చేసిన పర్వాలేదు అయ్యా.. మీరు చెబితే జనాలు నిజం అని నమ్మేస్తారు బాబోయ్ అంటూ ప్రదీప్ దండం పెట్టి లబోదిబో మన్నాడు. వీళ్లిద్దరి సంభాషణ నవ్వులు తెప్పించింది. ఇక ప్రదీప్.. మృణాల్ ఠాకూర్ ని మీకు ఎవరైనా లవ్ లెటర్స్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇక చివర్లో ఢీ ప్రీమియర్ లీగ్ ఫినాలే విజేతని ప్రకటించే బాధ్యత నానికే ఇచ్చారు. డిసెంబర్ 13న ఈ షో టెలికాస్ట్ కానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved