MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jagadeesh: కేశవకి బెయిల్ రాకుంటే పుష్ప 2 పరిస్థితి ఏంటి.. అల్లు అర్జున్, సుకుమార్ కి ఊహించని చిక్కులు

Jagadeesh: కేశవకి బెయిల్ రాకుంటే పుష్ప 2 పరిస్థితి ఏంటి.. అల్లు అర్జున్, సుకుమార్ కి ఊహించని చిక్కులు

ఒక వేళ జగదీష్ కి బెయిల్ రావడం కష్టం అయితే పుష్ప 2లో అన్ని అంశాల లెక్కలు మారిపోతాయి. జగదీష్ నటించాల్సిన సన్నివేశాలు ఇంకా చాలా ఉన్నాయట.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 07 2023, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రం కోసం అభిమానులు మాత్రమే కాదు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ చేసిన మ్యాజిక్ అలాంటిది. డైరెక్టర్ సుకుమార్ అయితే పుష్ప మొదటి భాగానికి పదింతలు పవర్ ఫుల్ గా ఉండేలా పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ అంతా అనుకున్నట్లుగా సాఫీగా జరుగుతున్న సమయంలో ఊహించని సెట్ బ్యాక్ ఎదురైంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

పుష్పలో అల్లు అర్జున్ కి అసిస్టెంట్ గా కేశవ పాత్రలో నటిస్తున్న జగదీష్ ఊహించని కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం జగదీష్ పోలీసులు రిమాండ్ లో ఉన్నాడు.  టాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఓ యువతిని జగదీష్ వేధింపులకు గురి చేశాడని ఆరోపణులు వినిపించాయి. ఆమె మరో వ్యక్తితో ఉన్న ప్రైవేట్ ఫోటోలని జగదీష్ తీసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. 

37

దీనితో జగదీష్ బెదిరింపులకు, వేధింపులు భరించలేక సదరు యువత గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం జగదీష్ అంటూ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పరారీలో ఉన్న జగదీష్ ని పంజాగుట్ట పోలీసులు డిసెంబర్ 6న అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగదీష్ పై ఉన్న ఆరోపణలు నిజమైతే అతడికి తీవ్రమైన చిక్కులు తప్పవు. 

47

జగదీష్ అరెస్ట్ తో పుష్ప 2 చిత్ర యూనిట్ లో కూడా అయోమయం నెలకొంది ఉంది. పుష్ప 2 లో జగదీష్ నటిస్తున్న కేశవ పాత్ర చాలా ముధ్యమైనది. పైగా ఫుల్ లెన్త్ క్యారెక్టర్ రోల్. అల్లు అర్జున్ కి అసిస్టెంట్ గా నటిస్తున్నాడు కాబట్టి దాదాపుగా ప్రతి సన్నివేశంలో జగదీష్ పాత్ర కూడా ఉండే అవకాశం ఉంది. మొదటి భాగంలో దాదాపుగా చాలా సన్నివేశాల్లో జగదీష్ ప్రమేయం ఉంటుంది. 

57

అతడికి బెయిల్ రాకుంటే మిగిలిన భాగం షూటింగ్ పరిస్థితి ఏంటి అనేది పుష్ప 2 చిత్ర యూనిట్ కి చాలా సమస్యగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ జగదీష్ కి బెయిల్ రావడం కష్టం అయితే పుష్ప 2లో అన్ని అంశాల లెక్కలు మారిపోతాయి. జగదీష్ నటించాల్సిన సన్నివేశాలు ఇంకా చాలా ఉన్నాయట. దీనితో ఏం జరుగుతుందో అని పుష్ప 2 యూనిట్ తీవ్ర ఉత్కంఠలో ఉంది. వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా పుష్ప 2 రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.  

67

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన సదరు మహిళ ఆరేళ్ళ క్రితమే వివాహం చేసుకుంది. భర్త నుంచి విడిపోయి హైదరాబాద్ సోమాజిగూడలో ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెతో జగదీష్ కి పరిచయం ఏర్పడడం ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ కి కారణం అయింది. ఆమె జగదీష్ ని వివాహం చేసుకోవాలని కూడా అనుకుంది. కానీ జగదీష్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. 

77

అప్పటి నుంచి ఆమె జగదీష్ ని దూరం పెడుతూ వచ్చింది. పెళ్లయ్యాక కూడా జగదీష్ ఆమెని మరచిపోలేకపోయాడు. తరచుగా ఆమె ఉండే అపార్ట్మెంట్ కి వెళ్ళవాడు. జగదీష్ కి పెళ్లి అయ్యాక ఆమె మరో యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఒకరోజు ఆమె ఉంటున్న ఇంటికి సీక్రెట్ గా వెళ్ళాడు. ఆమె యువకుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలని తీశాడు. తన మాట వినకుంటే ఆ ఫోటోలను లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved