Asianet News TeluguAsianet News Telugu

బిగ్‌ బాస్‌ తెలుగు 7ః అమర్‌ దీప్‌, యావర్‌, తేజ.. హౌజ్‌లో ఉండేందుకు వీరికి అర్హత లేదట.. నాగ్‌ బిగ్‌ ట్విస్ట్

బిగ్‌ బాస్‌ తెలుగు 7 శనివారం ఎపిసోడ్‌లో అందరి తప్పొప్పులను చెప్పాడు హోస్ట్ నాగార్జున. అదే సమయంలో హౌజ్‌లో ఉండేందుకు ఎవరు అనర్హులో కూడా తేల్చేశారు. 

amar deep yawar teja not deserve into bigg boss house nagarjuna gave shocking twist arj
Author
First Published Oct 7, 2023, 11:34 PM IST | Last Updated Oct 7, 2023, 11:34 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7.. ఐదో వారం చివరి రోజుకి చేరుకుంది. శనివారం ఎపిసోడ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వీకెండ్‌ కావడంతో నాగార్జున వచ్చారు. అందరికి కడిగి పడేశాడు. హౌజ్‌ మేట్స్ బెస్ట్ బడ్డీలుగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ వారం వారంతా కలిసే గేమ్‌ ఆడారు. అయితే ఈ వారం వారు చేసిన పొరపాట్లని నాగార్జున లేవనెత్తాడు. వాళ్లు ఎక్కడ తప్పు చేశారో చెప్పడమే కాదు, నిలదీశాడు. తప్పు అని స్పష్టం చేశాడు. వారి దుమ్ముదులిపాడు. అలా సందీప్‌, అమర్‌లు చేసిన మీస్టేకులు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. వారిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు నాగ్. 

తప్పుడు గేమ్‌లు ఆడుతున్నారు, చాలా తెలివితేటలను ప్రదర్శించారని చెప్పారు. వీడియోలు చూపించి మరీ కడిగేశాడు. అమర్‌ దీప్‌కి గట్టి వార్నింగ్‌లు కూడా ఇచ్చాడు. సంచాలక్‌గా ఫెయిల్‌ అయ్యావని, తొక్కలో సంచాలక్‌, బొక్కలో జడ్జ్‌ మెంట్‌ అంటూ వ్యాఖ్యానించాడు. మరోవైపు యావర్‌ చేసిన మిస్టేక్‌ని అడిగాడు. సంచాలక్‌కి సరైన నిర్ణయం తీసుకోలేదని, న్యాయం చేయలేదన్నారు. శోభా శెట్టి కూడా అదే మిస్టేక్‌ చేసిన నేపథ్యంలో ఆమెని కూడా కడిగేశాడు నాగ్‌. 

ఇక శివాజీ-ప్రశాంత్‌లు జెన్యూన్‌గా గేమ్‌ ఆడారని, చాలా బాగా ఆడరని ప్రశంసించారు. అదే నిజాయితీతో ఉండాలని, కానీ తమకు అన్యాయం జరుగుతుందంటే నిలదీయాలని, సైలెంట్‌ ఉండొద్దని చెప్పారు. మరోవైపు తేజ, యావర్‌లను కూడా నాగ్‌ ప్రశంసించాడు. ఈ ఇద్దరు మంచి కామెడీ పండించారని, గేమ్‌ కూడా బాగా ఆడారని తెలిపారు. ఇలా అందరి తప్పొప్పులను తెలిపారు నాగ్‌. 

ఈసందర్భంగా కంటెస్టెంట్లకి ఓ పరీక్ష పెట్టారు. హౌజ్‌లో ముగ్గురు కంటెస్టెంట్లు శోభా శెట్టి, ప్రశాంత్, సందీప్‌ హౌజ్‌మేట్స్ అయ్యారు. కానీ ఏడుగురు కాలేదు. వారి ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నారు. అయితే ఈ ఏడుగురిలో ముగ్గురు హౌజ్‌లో ఉండేందుకు అనర్హులో తమ అభిప్రాయాలు చెప్పాలని తెలిపారు నాగార్జున. దీంతో ప్రతి ఒక్కరు ముగ్గురి పేర్లని తెలిపారు. ప్రశాంత్‌.. యావర్‌, అమర్‌ దీప్‌, తేజల పేర్లు చెప్పాడు. ఎందుకో వివరించారు. సందీప్‌.. యావర్‌, శివాజీ, గౌతమ్‌ పేర్లు చెప్పాడు. ప్రియాంక.. గౌతమ్‌, శఙవాజీ, శుభ శ్రీ పేర్లని, అమర్‌ దీప్‌.. శుభ శ్రీ, యావర్‌, గౌతం పేర్లు చెప్పగా, శుభశ్రీ-గౌతమ్‌.. తేజ, ప్రియాంక, అమర్‌ దీప్‌ల పేర్లు తెలిపారు. 

తేజ.. గౌతమ్‌ శుభ శ్రీ, అమర్‌, యావర్‌.. అమర్‌, ప్రియాంక, తేజ పేర్లు చెప్పారు. శివాజీ.. అమర్‌ దీప్‌, ప్రియాంక, గౌతమ్‌ పేర్లు చెప్పారు. శోభా శెట్టి.. తేజ, గౌతమ్‌, శివాజీ పేర్లు తెలిపింది. తేజ టాస్క్‌ ల్లో వీక్‌ ఉన్నాడని, యావర్‌ రూల్‌ రూల్‌ అంటుంటాడని, అమర్‌ ఆట విషయంలో రాంగ్‌ వేలో ఆడుతున్నాడని తెలిపారు. ఇలా మొత్తంగా అమర్‌ దీప్‌, యావర్‌, తేజ లను అనర్హులుగా హౌజ్‌ తేల్చింది. మరి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో, అలాగే టాప్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరో నాగ్‌ రేపు ఎపిసోడ్‌లో వెల్లడిస్తానని తెలిపారు. ఇక రేపు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరో మినీ ఎంట్రీ ఎపిసోడ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో రవితేజ, సిద్ధార్థ్‌ సందడి చేయబోతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios