మాస్ మాహారాజ రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిషోతోనే ఈ సినిమా ఫ్లాప్ అని తేల్చేశారు ఆడియన్స్. అయితే రిలీజ్ కి ముందు సినిమాపై అంచనాలు ఏర్పడడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు ఈ సినిమా రూ.3.40 కోట్లు సాధించింది. 

ఏరియాల వారిగా సినిమా వసూళ్లు.. 
నైజాం.....................................1.26 కోట్లు 
సీడెడ్......................................0.46 కోట్లు 
ఉత్తరాంధ్ర..............................0.43 కోట్లు 
గుంటూరు................................0.43 కోట్లు 
ఈస్ట్.........................................0.30 కోట్లు 
వెస్ట్..........................................0.20 కోట్లు 
కృష్ణ.........................................0.20 కోట్లు 
నెల్లూరు................................... 0.12 కోట్లు 

మొత్తం కలెక్షన్స్.. 3.40 కోట్లు. సినిమాకు దారుణమైన నెగెటివ్ టాక్ రావడంతో వసూళ్ళ పరంగా ఈ ఎఫెక్ట్ బాగా చూపించే అవకాశం ఉంది. ఈ సినిమాను భారీ రేట్లకు కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ లకు నష్టాలు తప్పేలా లేవు.

అదే 'అపరిచితుడు' కహాని ('అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' రివ్యూ)