యాంగ్రీ స్టార్ తో అమలాపాల్ రొమాన్స్.. చాలా రోజుల తర్వాత తెలుగులో!
హాట్ బ్యూటీ అమలాపాల్ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన గ్లామర్ తో యువతలో అమలాపాల్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కెరీర్ జోరుమీద ఉండగానే ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. కానీ కొన్ని రోజులకే ఈ జంట విభేదాల కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే. వివాహం బెడిసికొట్టిన తర్వాత అమలాపాల్ నటనని కొనసాగిస్తోంది.
ఈ ఏడాది అమలాపాల్ 'ఆమె'చిత్రంలో నగ్నంగా నటించిన సంచలనం సృష్టించింది. గ్లామర్ ఒలకబోసేందుకు అయినా, సాహసోపేతమైన పాత్రలు చేసేందుకు అయినా తాను సిద్ధం అని అమల అంటోంది. తెలుగులో అమలాపాల్ నాయక్, ఇద్దరమ్మాయిలతో, బెజవాడ, జెండాపై కపిరాజు లాంటి చిత్రాల్లో నటించింది. సక్సెస్ రేట్ తక్కువున్నప్పటికీ అమలాపాల్ కు మంచి క్రేజ్ ఉంది.
అమలాపాల్ ఓ తెలుగు హీరో సరసన నటించి చాలా రోజులు గడుస్తోంది. ఇదిలా ఉండగా అమల తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. యాంగ్రీ హీరో రాజశేఖర్ సరసన నటించేందుకు అమలాపాల్ ఒకే చెప్పినట్లు సమాచారం.
రాజశేఖర్ త్వరలో ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. అమలాపాల్ రాజశేఖర్ తో రొమాన్స్ చేయబోతున్న విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాజశేఖర్ ఈ ఏడాది కల్కి చిత్రంతో ప్రేక్షకులని పలకరించారు.