అఫీషియల్..మళ్ళీ పెళ్ళికి రెడీ అవుతున్న అమలాపాల్.. కాబోయే భర్తని ముద్దుల్లో ముంచేస్తూ, వైరల్ వీడియో
అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది.

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు. అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది.
రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే.2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.
అయితే అమలాపాల్ రెండో పెళ్లి విషయంలో చాలా రూమర్లు వచ్చాయి. అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది అంటూ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అది పెళ్లి కాదు అని యాడ్ షూట్ చేసింది అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. అయితే అమలాపాల్ మాత్రం సింగిల్ గానే కనబడుతూ వచ్చింది. కానీ ఆమె సింగిల్ గా లేదు. తన ప్రియుడుతో ఎంజాయ్ చేస్తోంది.
అయితే నేడు అమలాపాల్ తన పుట్టినరోజు వేడుక సెలెబ్రేట్ చేసుకుంటోంది. అమలాపాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రియుడు ప్రపోజ్ చేశాడు. దీనికి అమలాపాల్ యస్ చెప్పింది. అమలాపాల్ కి కాబోయే భర్త పేరు జగత్ దేశాయ్. రీసెంట్ గానే వీరిద్దరూ డేటింగ్ మొదలు పెట్టారట. అంతలోనే అమలాపాల్ బర్త్ డే వచ్చింది. దీనితో జగత్ ఆమెకి ప్రపోజ్ చేయగా అమలాపాల్ పెళ్ళికి యస్ చెప్పింది.
జగత్ అమలాపాల్ కి జగత్ రింగ్ తొడిగాడు. దీనితో అమలాపాల్ తన కాబోయే భర్తని ముద్దుల్లో ముంచేస్తోంది. ఈ బ్యూటిఫుల్ వీడియోలో నెట్టింట వైరల్ గా మారింది. నా రాణి యస్ చెప్పింది.. వెడ్డింగ్ బెల్స్.. హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ జగత్ పోస్ట్ చేశారు.vఇదిలా ఉండగా జగత్ గోవా కి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. లగ్జరీ విల్లాలో అతడు మేనేజర్ గా పనిచేస్తున్నాడట. అమలాపాల్ కి అతడికి పరిచయం కావడం అది ప్రేమగా మారడం చకచకా జరిగిపోయాయి. మొత్తంగా అమలాపాల్ మరోసారి పెళ్ళికి సిద్ధం అవుతోంది. దీనితో సోషల్ మీడియాలో ఆమెకి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.