కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోన్న సమయంలోనే దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుంది అమలాపాల్. అయితే కొంతకాలానికే విడాకులు తీసుకొని ఒకరికొకరు దూరమయ్యారు. రీసెంట్ గా విజయ్ మరో పెళ్లి చేసుకున్నాడు.

అమలాపాల్ మాత్రం హీరోయిన్ గా మరిన్ని సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. వైవిధ్యమైన కథలను  ఎన్నుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది. ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని కామెంట్స్ చేసింది అమలాపాల్.

''మన జీవితంలో జరిగేవేవీ మన చేతిలో ఉండవు.. నేను హీరోయిన్ అవుదామని అనుకోలేదు.. కానీ అయ్యాను. అలానే పెళ్లి అనేది మన చేతిలో ఉండదు. దేవుడే నిర్ణయిస్తాడు.. దేవుడిచ్చే దాన్ని మనం స్వీకరించాలి'' అంటూ చెప్పుకొచ్చింది. 

లైఫ్ పార్టనర్ కంటే మనతో మనం కనెక్ట్ అయినప్పుడే లైఫ్ ని ఎంజాయ్ చేస్తామని.. ప్రస్తుతం ఒకరితో ప్రేమలో ఉన్నానని చెప్పి షాకిచ్చింది. అతడు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదని.. ప్రేమలో ఉన్నాను.. దాన్ని అలాగే ఉండనిద్దాం అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం దేని గురించి ఎక్కువ ఆలోచించడం లేదని చెప్పింది. జీవితం చాలా హాయిగా ఉందని తెలిపింది. ఇంతకీ అమలాపాల్ ప్రేమిస్తున్న ఆ వ్యక్తి ఎవరో..? తరువాత అయినా రివీల్ చేస్తుందేమో చూడాలి!