కోలివుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ ని ఇప్పుడు నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. గతంలో లుంగీ కట్టుకొని సారా సీసా చేత పట్టుకొని కనిపించిన అమలాపాల్ తాజాగా పొగ తాగుతూ ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. 

ఇప్పటికే 'మహా' సినిమా పోస్టర్ పై హన్సిక పొగ తాగుతూ కనిపించిందని ఆమెపై కేసులు పెట్టారు. 'సర్కార్' సినిమాలో విజయ్ స్మోక్ చేస్తూ కనిపించడాన్ని కూడా తప్పుబట్టారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరింది అమలాపాల్.

ఇలాంటి వివాదాలు అమలాపాల్ కి కొత్తేమీ కాదు.. ఆమె సారా సీసా పట్టుకొని మందు బాబుల స్పాట్ కి వెళ్ళినప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇప్పుడు స్మోక్ చేస్తూ కనిపించడాన్ని మాత్రం వదిలేస్తారా..? అయితే తాను కావాలని సిగరెట్ తాగలేదని, ఒక హాలీవుడ్ అభిమాని కోరిక నెరవేర్చడం కోసం అలా చేశానని సమర్ధించుకుంటోంది.

కానీ అభిమానులు మాత్రం ఆమెపై విమర్శలు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో ద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావని ఆమెని ప్రశ్నిస్తున్నారు.