చాలా కాలం తరువాత వెండితెరపై మెరుపులు మెరిపించింది అమలా అక్కినేని.  సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్న అమలా.. తన భర్త నాగార్జునతో నటిస్తారా అంటే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.  

చాలా కాలం తరువాత వెండితెరపై మెరుపులు మెరిపించింది అమలా అక్కినేని. సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్న అమలా.. తన భర్త నాగార్జునతో నటిస్తారా అంటే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 

రీసెంట్ గా శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఓకే ఒక జీవితం సినిమాలో నటించి మెప్పించింది అమల అక్కినేని. ఈ సినిమాలో అమల శర్వాకి తలి పాత్రలో నటించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు అమల పాత్రకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వస్తున్నాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తరువాత దాదాపు 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత సినిమాలో నటించింది అమల. ఈ సినిమా చూసాక ప్రేక్షకులు, సెలబ్రిటీలు అంతా అమలని పొగిడేస్తున్నారు. 

ఇక రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన అమల ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. వరుసగా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. నాగార్జున గురించి ఆసక్తికర విషయం శేర్ చేసుకున్నారు. నాగార్జున గారితో కలిసి సినిమా చేస్తారా అని అడగగా..నాగార్జున, నేను ఎప్పుడూ ఇంట్లో కలిసే ఉంటాము. మళ్ళీ స్క్రీన్ మీద ఎందుకు.. వద్దు. ఆయనతో సినిమా చేసే ఉద్దేశం నాకు లేదు అని అన్నారు. అమలా అలా అనడంతో అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఎందుకని వరుసగా సినిమాల్లో నటించలేదు...? ఇక నుంచి వరుస సినిమాల్లో నటిస్తారా అని ప్రశ్నించగా.. అమల సమాధానమిస్తూ.. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమా తర్వాత మలయాళంలో రెండు, హిందీలో మూడు సినిమాలు, ఒక వెబ్‌ సిరీస్‌ చేశాను. తెలుగులో లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ తర్వాత నేను చేసిన సినిమా ఇదే అన్నారు. అయిదేళ్లుగా అన్నపూర్ణ ఫిల్మ్‌ అండ్‌ మీడియా టీమ చూసుకుంటూ బిజీ అయిపోయానని అన్నారు అమల. వందల మంది విద్యార్థుల భవిష్యత్‌ బాధ్యత నాపై ఉంది. నా సమయం వారికోసం కేటాయిస్తున్నాను. అందుకే సినిమాలు చేయడంలేదు అన్నారు అమల.

అంతే కాదు ఇంట్లో ఫ్యామిలీ బాధ్యతలు కూడా ఉంటాయ కదా.. వరుసగా సినిమాలు చేస్తే ఆ బాధ్యతలపై దృష్టి పెట్టలేను. అందుకే ఒకే ఒక జీవితం సినిమా లాంటి నా మనసుకు హత్తుకునే కథ, పాత్ర వస్తేనే నేను చేస్తాను అని అన్నారు అమల. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తరువాత తన మనసుకి నచ్చిన కథ ఒకే ఒక జీవితం అందుకే ఈ సినిమాను చేయడానిక టైమ్ కేటాయించగటిగానంటోంది అమల.