పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కూడా సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో నటించాడు. ఆ సమయంలోనే పవన్ కొందరు నిర్మాతలకు కమిట్మెంట్ ఇచ్చినట్లు వినికిడి. పవన్ కళ్యాణ్ కు అచొచ్చిన నిర్మాత ఏఎం రత్నం. తెలుగు, తమిళ రెండు భాషల్లో రత్నం స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 

పవన్, రత్నం కాంబోలో ఖుషి, బంగారం లాంటి చిత్రాలు వచ్చాయి. రత్నంకు శంకర్ లాంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేసిన అనుభవం కూడా ఉంది. కాటమరాయుడు చిత్రం తర్వాత ఏఎం రత్నం కోసం ఓ చిత్రం చేస్తానని పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ పవన్ పూర్తిగా రాజకీయాలతో బిజీ కావడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. 

రత్నం, మైత్రి మూవీ మేకర్స్ లాంటి వారి వద్ద పవన్ అడ్వాన్సులు తీసుకున్నట్లు కూడా టాక్. ఇటీవల ఎన్నికలు ముగియడంతో ఏఎం రత్నం మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాడట. ప్రముఖ దర్శకుడు క్రిష్ వద్ద పవన్ కు సరిపడే ఓ కథ ఉన్నట్లు తెలుస్తోంది.  నేపథ్యంలో ఉండే ఆ కథని పవన్ కు ఎలాగైనా వినిపించాలని రత్నం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ మాత్రం ప్రస్తుతం సినిమాలు చేసే మూడ్ లో లేరు. 

అదే విధంగా పవన్ ఒకే అంటే సినిమా చేయడానికి మైత్రి సంస్థ కూడా సిద్ధంగా ఉంది.