పవన్ కళ్యాణ్ లో ఒక ఎంజీఆర్ ని చూశా.. కేకలు కాదు, ఓట్లు వేయండి.. బ్రో ప్రీ రిలీజ్ లో ఏఎం రత్నం
మామ అల్లుళ్ళు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినోదయ సీతంకి రీమేక్. దీనితో ఆడియన్స్ లో జోష్ నింపే విధంగా నేడు హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మామ అల్లుళ్ళు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినోదయ సీతంకి రీమేక్. ఇది పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరి ఇమేజ్ కి భిన్నమైన చిత్రం అని చెప్పొచ్చు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే ట్రైలర్స్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన బ్రో శ్లోకం యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. పాజిటివ్ బజ్ మధ్య బ్రో చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో రచ్చ చేసేందుకు సిద్ధం అవుతోంది. దీనితో ఆడియన్స్ లో జోష్ నింపే విధంగా నేడు హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం అతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని తాను 22 ఏళ్లుగా దగ్గరుండి గమనిస్తున్నా. ఆయనలో నేను ఒక ఎంజీఆర్ ని చూశా. ఎందుకంటే ఎంజీఆర్ గారు తన చిత్రాల్లో ఒక పాటైనా, డైలాగ్స్ అయినా ప్రజలని ఉద్దేశించేలా, వాళ్ళకి ఉపయోగపడేలా దగ్గరుండి రాయించుకునేవారు.
పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఖుషి చిత్రంలో శిల్పా శెట్టితో ఒక సాంగ్ ప్లాన్ చేశాం. తమిళంలో ఆల్రెడీ ఆమెతో షూట్ చేసాం. కానీ తెలుగులో పవన్ ఆ సాంగ్ వద్దు అన్నారు. ఒక హిందీ సాంగ్ అనుకుంటున్నా అని చెప్పారు. తెలుగు సినిమాలో హిందీ సాంగ్ ఏంటి అనుకున్నాం. కానీ పవన్ కోసం ఒప్పుకున్నాం. బాంబే నుంచి రచయితని పిలిపించాం. కళ్యాణ్ గారు ఆయనకి సందర్భం వివరించారు. అంతే గంటలోనే 'యే మేరా జహా' అనే సాంగ్ రెడీ అయిపోంది. ఇది నా దేశం, ఇక్కడ రౌడీలకు, మోసం చేసే రాజకీయ నాయకులకు చోటు లేదు అనే అర్థం వచ్చేలా పవన్ ఆ సాంగ్ పెట్టినట్లు ఏఎం రత్నం అన్నారు.
పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకి మాత్రమే కాదు దేశానికి కూడా నాయకుడు అవుతారు అంటూ పాలిటికల్ డైలాగ్స్ చేశారు. ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుంటే.. కళ్యాణ్ గారు చెప్పినట్లు కేకలు వేయడం కాదు.. మీరంతా ఓట్లు వేయించాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే చిత్ర దర్శకుడు సముద్రఖని కి, సాయిధరమ్ తేజ్ కి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని శుభాకాంక్షలు తెలిపారు.