Asianet News TeluguAsianet News Telugu

2023 Golden Globe Awards Winners List: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కంప్లీట్ విన్నర్స్ లిస్ట్...!


లాస్ ఏంజెల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక ముగిసింది. నామినేషన్స్ పొందిన చిత్రాల నుండి విన్నర్స్ ని ప్రకటించారు. తెలుగు చిత్రం ఆర్ ఆర్ ఆర్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. 

along with rrr movie complete list of golden globe awards winners list
Author
First Published Jan 11, 2023, 12:17 PM IST

ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇండియన్ సినిమాకు ప్రత్యేకంగా నిలిచాయి. తెలుగు మూవీ ఆర్ ఆర్ ఆర్ అంతర్జాతీయ వేదికపై మెరిసింది. రెండు విభాగాల్లో నామినేటైన ఆర్ ఆర్ ఆర్ ఒక విభాగంలో అవార్డు అందుకుంది. ఆర్ ఆర్ ఆర్ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ విభాగంలో నామినేట్ అయ్యింది. నాన్ ఇంగ్లీష్ మూవీ విభాగంలో అర్జెంటీనా చిత్రం అర్జెంటీనా 1985 విన్నర్ గా నిలిచింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో మాత్రం అవార్డు కైవసం చేసుకుంది. 

  ప్రపంచ సినిమా వేదికపై ఆర్ ఆర్ ఆర్ విజయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకుంటుంది. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోగా... చిరంజీవి, ఏ ఆర్ రెహమాన్ తో పాటు పలువురు ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.  అవార్డు అందుకున్న కీరవాణి ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక వేదికపై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. నాటు నాటు సాంగ్ ని అవార్డుకి ఎంపిక చేసిన గోల్డెన్ గ్లోబ్ జ్యూరీ మెంబర్స్ కి కృతఙ్ఞతలు తెలిపిన కీరవాణి... ఈ ఆనందాన్ని తన భార్య శ్రీవల్లితో పంచుకుంటున్నట్లు తెలిపారు. తనకు దక్కిన ఈ గౌరవానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ కారణం అన్నారు.  


  ఇక గోల్డెన్ గ్లోబ్ 2023 సినిమా విభాగంలో అవార్డ్స్ అనుకున్న చిత్రాల జాబితా పరిశీలిస్తే... 

బెస్ట్ మోషన్ పిక్చర్ - డ్రామా
విన్నర్: ది ఫాబెల్మాన్స్

బెస్ట్ మోషన్ పిక్చర్  -    మ్యూజిక్  OR  కామెడీ

విన్నర్  : ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్

బెస్ట్ మోషన్ పిక్చర్  -   నాన్ ఇంగ్లీష్ 
విన్నర్: అర్జెంటీనా, 1985


బెస్ట్ మోషన్ పిక్చర్   - యానిమేటెడ్
విన్నర్: గిల్లెర్మో డెల్ టోరోస్  పినోచియో 


బెస్ట్ డైరెక్టర్ - మోషన్ పిక్చర్ 

విన్నర్: స్టీవెన్ స్పీల్బర్గ్, ది ఫాబెల్మాన్స్

బెస్ట్ స్క్రీన్‌ప్లే - మోషన్ పిక్చర్ 
విన్నర్  : మార్టిన్ మెక్‌డొనాగ్, ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్

బెస్ట్ యాక్టర్ - డ్రామా
విన్నర్: ఆస్టిన్ బట్లర్, ఎల్విస్

బెస్ట్ యాక్ట్రెస్ -డ్రామా
విన్నర్: కేట్ బ్లాంచెట్, టార్

బెస్ట్ యాక్టర్ -మ్యూజిక్  OR  కామెడీ
విన్నర్: కోలిన్ ఫారెల్, ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్

బెస్ట్ యాక్ట్రెస్ -మ్యూజిక్  OR  కామెడీ

విన్నర్: మిచెల్ యో, ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ యట్ ఒన్స్

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: 
విన్నర్: కే హుయ్ క్వాన్, ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ యట్ ఒన్స్

ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్:
విన్నర్: ఏంజెలా బాసెట్, బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ -మోషన్ పిక్చర్
విన్నర్: జస్టిన్ హర్విట్జ్, బాబిలోన్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - మోషన్ పిక్చర్
విన్నర్: కీరవాణి, ఆర్ ఆర్ ఆర్ మూవీ 

Follow Us:
Download App:
  • android
  • ios