అభిమాని మరణం బన్నీని కలచివేసింది

First Published 14, May 2018, 11:05 AM IST
Alluarjun feeling bad with his fan's death
Highlights

అభిమాని మరణం బన్నీని కలచివేసింది

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన అభిమాని దేవసాయి గణేష్ మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం వినగానే స్టైలిష్ స్టార్  ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. గణేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.'సాయి గణేశ్ మృతి వార్త విని నా గుండె పగిలిపోయింది. అతని కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి' అని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అల్లు అర్జున్ పేర్కొన్నారు. పలువురు బన్నీ అభిమానులు అనకాపల్లి చేరుకుని గణేష్ కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.

అనకాపల్లికి చెందిన 10వ తరగతి కుర్రాడు దేవసాయి గణేష్ అల్లు అర్జున్‍‌కు వీరాభిమాని. కొంత కాలంగా గణేష్ బోన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. తన అభిమాన నటున్ని చూడాలని, కలవాలని దేవసాయి గణేష్ కోరడంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఫ్యాన్ అసోసియేషన్స్ ద్వారా అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లారు. తన అభిమాని గణేష్ కోరికపై వెంటనే స్పందించిన స్టైలిష్ స్టార్ ఇటీవల అనకాపల్లి వెళ్లి గణేష్‌ను కలిసిశారు. త్వరలోనే కోలుకుంటావని దైర్యం చెప్పారు. అతడి చికిత్స కోసం ఆర్థిక సహాయం చేసేందుకు కూడా బన్నీ ముందుకొచ్చారు. అయితే ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడంతో బన్నీ విచారం వ్యక్తం చేశారు.

loader