మలయాళం మూవీ ‘1971: బియాండ్ బోర్డర్స్’ సినిమా తెలుగులోకి అనువాదం కావడం పట్ల అంత సానుకూలంగా లేడట ఆ సినిమాలో నటించిన అల్లు శిరీష్. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా కేరళలో కొన్ని నెలల కిందట విడుదల అయ్యింది. అయితే.. అక్కడ ఆ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఫ్లాఫ్ గా నిలిచింది. అప్పట్లోనే అది తెలుగులో విడుదల అవుతుంది అన్నారు కానీ అది జరగలేదు. కానీ.. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఆ మలయాళీ సినిమా హక్కులను కొనుక్కొని తెలుగులో విడుదల చేస్తున్నాడు.

దానికి ‘యుద్ధభూమి’ అనే టైటిల్ ను కూడా పెట్టాడు. గతంలో ఇదే పేరుతోచిరంజీవి సినిమా ఒకటి వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫ్లాఫ్. ఇప్పుడు అదే టైటిల్ ను ఉపయోగించుకుని అల్లు శిరీష్ సినిమా డబ్ అవుతోంది. అయితే... ఆల్రెడీ మలయాళంలో ఫ్లాఫ్ అయిన సినిమాను ఇప్పుడు తెలుగులోకి తీసుకురావడం శిరీష్ కు అస్సలు ఇష్టం లేదని టాక్.

ఇటీవలే విడుదల అయిన తన సినిమా ఫలితంతో ఈ హీరో కొంత నిరాశలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ మరో ఫ్లాఫ్ సినిమాను తెలుగులోకి తీసుకురావడం అస్సలు ఇష్టం లేదట. దీంతో.. మలయాళం నుంచి 1971 ను తెలుగులోకి అనువదిస్తున్న నిర్మాతపై హీరో మండిపడుతున్నాడని సమాచారం. ఆ సినిమాను తెలుగులోకి అనువదిస్తున్న నిర్మాతకు ఫోన్ చేసి ఈ హీరో విరుచుకుపడ్డాడని ఫిల్మ్ నగర్ టాక్.

ఆ సినిమాను తెలుగులోకి అనువదించి విడుదల చేయాలంటే.. తనకు 11 లక్షల రూపాయల పారితోషకం ఇవ్వాలనే ఒక అగ్రిమెంట్ ఉందని, దాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారని కూడా ఈ హీరో ఆ నిర్మాతకు క్లాస్ పీకాడట. ఓవరాల్ గా తన సినిమా విడుదల తనకే ఇష్టం లేదు ఈ హీరోకి.