మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు హీరో అల్లు శిరీష్.'ఒక్క క్షణం' సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న శిరీష్.. మలయాళంలో సూపర్ హిట్ అయిన  'ABCD'కి రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తెలుగులో కూడా అదే టైటిల్ 'ABCD'తో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 'అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ' అనేది ఉపశీర్షిక. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

మోడరన్ అబ్బాయి గెటప్ లో ఉన్న శిరీష్ ఒక బ్యాగు తగిలించుకొని స్కేటింగ్ బోర్డ్ పై దూసుకుపోతున్నాడు. అతడి ప్రయాణం అమెరికా నుండి ఇండియా వరకు సాగుతోందని మోషన్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

రుక్సార్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సురేష్ బాబు సమర్పిస్తోన్న ఈ సినిమాలో నాగబాబు, కోట శ్రీనివాసరావు, శుభలేక సుధాకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.