స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోదరుడు, హీరో అల్లు శిరీష్‌ జిమ్‌లో చేమటోడుస్తున్నాడు. గతంలో కంటే మరింతగా బరువు తగ్గి కాస్త స్లిమ్‌గా మారుతున్నారు. నిత్యం వర్కౌట్‌ చేస్తూ తనని తాను ఫిట్‌గా మార్చుకుంటున్నాడు. అదే సమయంలో నటుడిగా సరికొత్తగా మారబోతున్నాడు. అల్లు శిరీష్‌ ఇటీవల బాగా బరువు తగ్గాడు. వెయిట్‌ లాస్‌ సీక్రెట్‌ ఏంటో తెలిసిపోయింది. ఆయన జిమ్‌లో ఏ రేంజ్‌లో కష్టపడుతున్నాడో తెలిసిపోయింది. తాజాగా శిరీష్‌ వంద కేజీల బెంచ్‌మార్క్ కి చేరుకున్నాడు. వంద కేజీల వెయిట్‌తో ఆయన చెస్ట్ ఎక్సర్‌ సైజ్‌లు చేశారు. 

`జిమ్‌లో కొత్తగా పర్సనల్‌ బెంచ్‌ మార్క్ ని తాకినందుకు చాలా సంతోషంగా ఉంది. ఛాతీ ప్రెస్‌ మెషిన్‌లో వంద కేజీలు. నా ఫిట్‌నెస్‌ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దూరం వెళ్లాలి` అని పేర్కొన్నాడు శిరీష్‌. ఇటీవల ఆయన ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులోనూ కాస్త బరువు తగ్గి కనిపిస్తున్నారు. అంతేకాదు ఈ మధ్య ఆయన పాల్గొన్న `లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడి` చిత్ర ప్రెస్‌మీట్‌లోనూ స్లిమ్‌గా కనిపించారు. సినిమాల కోసం ఆయన బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. 

శిరీష్‌ చివరగా `ఏబీసీడీ`లో నటించారు. ఇది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో ఎలాగైనా ఈ సారి హిట్‌ కొట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాకేష్‌ శశి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఆ చిత్రం రూపొందుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో లవర్‌ బాయ్‌గా కనిపించేందుకు శిరీష్‌ ఇంతగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సారైనా హిట్‌ కొడతాడేమో చూడాలి. కానీ ప్రస్తుతం ఆయన పంచుకున్న జిమ్‌ వీడియో వైరల్‌ అవుతుంది.