ఏబిసిడీ చిత్రంతో రీసెంట్ గా పలకరించిన అల్లు శిరీష్ కు ఇప్పటిదాకా సరైన హిట్ అనేది లేదు.  దాంతో హిట్ కోసం డెస్పరేట్ గా ఉన్నాడు. విభిన్నమైన కథలతో పలకరించాలనుకుంటున్నారు. అందులో భాగంగా వైవిధ్యమైన పాత్రలను చేస్తూ వేరే హీరోలతో స్క్రీన్ పంచుకోవటానికి కూడా సిద్దపడుతున్నాడు. ఆ మధ్యన మోహన్ లాల్ తో సినిమా చేసిన అల్లు శిరీష్ ఇప్పుడు విజయ్ ఆంటోనితో సినిమా చేస్తున్నాడు.

బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తన సినిమాలు వైవిధ్యభరితంగా వుంటాయనే నమ్మకాన్ని ఆయన ప్రేక్షకులకు కలిగించాడు. అప్పటి నుంచి ఆయన నుంచి ఒక సినిమా వస్తుందీ అంటే అభిమానులు ఆసక్తిని చూపిస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఆంటోని కథానాయకుడిగా తమిళంలో ఒక సినిమా రూపొందుతోంది.

విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి మళై పిడిక్కాద మనిదన్ (వర్షం నచ్చని వ్యక్తి) టైటిల్ ను ఖరారు చేశారు. ఉత్కంఠభరితమైన కథాకథనాలతో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో అల్లు శిరీష్ కనిపించనుండటం విశేషం. ఈ పాత్ర తనకి మంచి పేరు తెస్తుందని శిరీష్ చెప్పడం, కథలో కొత్తదనాన్ని చెప్పకనే చెబుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.