ఇప్పుడు రెండు ఫస్ట్ లుక్‌లతో వచ్చాడు. అదే సమయంలో చిత్ర టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌తో ఇంటెన్స్‌, రొమాంటిక్‌ లుక్‌లో ఉన్నాడు శిరీష్‌. తమ రిలేషన్‌ ప్రేమ కాదంటున్నారు. 

అల్లు హీరో శిరీష్‌ రొమాన్స్ లో తగ్గేదెలే అంటున్నాడు. కొత్త సినిమాకి సంబంధించి వరుసగా ప్రీ లుక్‌లతో అదరగొడుతున్నారు. ఇటీవల రొమాంటిక్‌ లుక్‌ని పంచుకుని షాక్‌ ఇచ్చిన శిరీష్‌ రెండో ప్రీలుక్‌తో రెచ్చిపోయాడు. మరింత ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ప్రీ లుక్స్ వైరల్‌గా మారాయి. ఇప్పుడు రెండు ఫస్ట్ లుక్‌లతో వచ్చాడు. అదే సమయంలో చిత్ర టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌తో ఇంటెన్స్‌, రొమాంటిక్‌ లుక్‌లో ఉన్నాడు శిరీష్‌. తమ రిలేషన్‌ ప్రేమ కాదంటున్నారు. 

అల్లుశిరీష్‌ బర్త్ డేని పురస్కరించుకుని విడుదల చేసిన తాజా ఫస్ట్ లుక్‌లు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాకి రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తున్నారు. `కొత్త జంట`‌, `శీర‌స్తు శుభ‌స్తు`, `ఏబిసిడి` వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో `ఒక్క క్ష‌ణం` వంటి వినూత‌న్న‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన‌ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్, 

Scroll to load tweet…

మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో `100% ల‌వ్`, `భలే భ‌లే మ‌గాడివోయ్`, `గీత‌గోవిందం`, `ప్ర‌తిరోజూపండుగే` వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ మీద ఈ సినిమా సిద్ధ‌మైంది. మే30 అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల‌కు అల్లు శిరీష్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు.