మెగా యువ హీరోలలో ప్రతి ఒక్కరు సాలిడ్ హిట్స్ తో వారికంటూ ఒక స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చుకున్నారు. అల్లు ఫ్యామిలిలో అల్లు అరవింద్ నిర్మాతగా లాభాలను అందుకుంటుంటే తనయుడు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. అయితే ఒక్క అల్లు శిరిష్ మాత్రం ఇంకా కెరీర్ ను సక్సెస్  ట్రాక్ లోకి సెట్ చేసుకోలేకపోతున్నాడు. 

ఈ యువ హీరో గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. శ్రీ రస్తు శుభమస్తు సినిమా తప్పితే ఇంతవరకు ఒక్క సక్సెస్ కూడా చూడలేదు. ఇక నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ కొట్టాలని రీమేక్ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఏబీసీడీ సినిమాను రీమేక్ చేసిన శిరీష్ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయారు. 

అయితే రీసెంట్ గా రాక్షసుడు సినిమాతో బెల్లంకొండ వారసుడికి బాక్స్ ఆఫీస్ హిట్ అందించిన దర్శకుడు రమేష్ వర్మతో నిర్మాత అల్లు అరవింద్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కొడుకు శిరీష్ కోసం ఏదైనా రీమేక్ ను సెట్ చేసుకొమ్మని చెప్పినట్లు సమాచారం. శిరీష్ కూడా రమేష్ వర్మతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.