Asianet News TeluguAsianet News Telugu

రెండుసార్లు కరోనా పరీక్ష చేయించుకున్నా..: అల్లు శిరీష్


 క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ త‌న ఇంటికి మెగా ఫ్యామిలీని ఆహ్వానించ‌గా, ప్ర‌తి ఒక్క‌రు ఈ వేడుక‌లో సంతోషంగా  పాల్గొన్నారు.  స‌రిగ్గా నాలుగు రోజుల క్రితం జ‌రిగిన ఈ వేడుక‌లో పాల్గొన్న వారంద‌రు చ‌ర‌ణ్‌కు స‌న్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగారు. ఇప్పుడు చ‌ర‌ణ్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో మిగ‌తా వారిలో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

Allu Shirish opens about his Covid test and tweeted jsp
Author
Hyderabad, First Published Dec 31, 2020, 3:37 PM IST

కరోనా మహమ్మారి విజృంభణకు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మెగా హీరోలు కరోనా బారిన పడ్డారు. రీసెంట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ కు జ‌రిపిన ప‌రీక్ష‌ల‌లో క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని వరుణ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. హోమ్ క్వారంటైన్ పాటిస్తూ మందులు వాడుతున్నాను అని తెలిపాడు. అయితే తనతో టచ్‌లో ఉన్న వారి జాగ్రత్త పడాలని, టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు. కాగా అదే రోజు ఉదయం రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడ్డారు. దాంతో మెగా ప్యామిలీలో అందరూ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.

 క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ త‌న ఇంటికి మెగా ఫ్యామిలీని ఆహ్వానించ‌గా, ప్ర‌తి ఒక్క‌రు ఈ వేడుక‌లో సంతోషంగా  పాల్గొన్నారు.  స‌రిగ్గా నాలుగు రోజుల క్రితం జ‌రిగిన ఈ వేడుక‌లో పాల్గొన్న వారంద‌రు చ‌ర‌ణ్‌కు స‌న్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగారు. ఇప్పుడు చ‌ర‌ణ్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో మిగ‌తా వారిలో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

మరో పక్క రామ్ చరణ్‌తో పాటు ఉపాసన కూడా క్వారంటైన్‌లో ఉంటోంది. తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.  

 తాజాగా అల్లు శిరీష్ కూడా తనకు వచ్చిన కరోనా ఫలితం గురించి చెబుతూ నివారణ చర్యలు కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పటికి రెండు సార్లు పరీక్షలు చేయించుకున్నాను.. నెగెటివ్ వచ్చింది.. ఈ విషయం మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.. రెండుసార్లు నెగెటివ్ అనే వచ్చింది. సాధారణంగా కోవిడ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నేను పెళ్లికి వెళ్లాను.. బయటకు అవుట్ డోర్‌లో ప్రయాణించాను..

 ప్రతీరోజూ వంద మందితో సెట్‌లో షూటింగ్ చేస్తుంటాను..నేను మాస్క్ ధరిస్తాను.. శానిటైజర్ వాడుతుంటాను.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ జనాలతో తిరగడం అనేది మానడం కుదరని పని.. కానీ నన్ను రక్షించేది మాత్రం ఆయుర్వేదం.. కొంత అదృష్టం. మనిషి ఈ ప్రపంచాన్ని ఇతర ప్రాణులతో కలిసి పంచుకుంటున్నాడు. ఇతర ప్రాణులతో మనకు వచ్చే రోగాలను నయం చేసేందుకు పురాతన కాలంలోనే ఎన్నో నివారణ మార్గాలు, మందులను కనిపెట్టారు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు మాస్క్‌లు వాడటమే కాకుండా.. ఆయుర్వేద పద్దతులు కూడా వాడండంటూ అల్లు శిరీష్ అందరినీ కోరాడు.

Follow Us:
Download App:
  • android
  • ios