Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి వెయ్యి కోట్లు.. ఇక అల్లు అరవింద్ "రామాయణం"

  • వెయ్యి కోట్లు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి
  • నిర్మాతల ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చిన బాహుబలి
  • రామాయణం తెరకెక్కించేందుకు 500 కోట్ల బడ్జెట్ తో అల్లు అరవింద్ ప్లాన్

 

allu arvind to produce ramayan in a big way

ఇప్పుడు భారత దేశంలో సినిమా అంటే బాహుబలి. బాహుబలి సాధించిన వెయ్యి కోట్ల కలెక్షన్లు దేశవ్యాప్తంగా నిర్మాతల ఆలోచనా తీరును మార్చేస్తుున్నాయి. తెలుగు సినిమా మార్కెట్ కు బాహుబలి మరిన్ని దారులు తెరిచింది. మరి ఈ దారుల్లో మరో తెలుగు సినిమా వెళ్లాలంటే ఏం చేయాలి. దేశవ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యమైన సబ్జెక్ట్ ను ఎంచుకోవాలి. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అదే పనిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన రామాయణాన్ని 500 కోట్ల భారీ బడ్జెట్ తో వెండితెరపైకి తీసుకురావాలనుకుంటున్నారు.

 

నిజానికి మొన్నటివరకు అల్లు అరవింద్ కన్ను మహాభారతంపై ఉండేది. కానీ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఈమధ్యే ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు. దీంతో రామాయణంను తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు అల్లు అరవింద్. తెలుగు,తమిళ,హిందీ భాషల్లో దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

 

బాహుబలి సినిమా రెండు భాగాలుగా వస్తే, అల్లు అరవింద్ రామాయణం సినిమా 3 భాగాలుగా రాబోతోంది. అల్లు అరవింద్ తో కలిసి ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios