Asianet News TeluguAsianet News Telugu

'వాల్తేరు వీరయ్య' కి అరవింద్, నాగ్ సాయిం

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల కాంబినేషన్ లో రూపొందిన భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' . 

Allu Arvind, Nagarjuna Helping Chiru Waltair Veerayya?
Author
First Published Jan 8, 2023, 10:14 AM IST

జనవరి 13 వాల్తేరు వీరయ్య(waltair veerayya)తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. నిన్న ఈవినింగ్ రిలీజ్ చేసిన ట్రైలర్  తో సినిమా మీద ఎక్సపెక్టేషన్స్ భారీగా పెరిగాయి. అయితే సంక్రాంతికి రెండు పెద్ద డబ్బింగ్ సినిమాలు, బాలయ్య తో చేసిన వీర సింహా రెడ్డి కూడా పోటీ ఉండటంతో ..థియోటర్స్ సమస్య  ఎలా తీరుతుందనేది ఎవరికీ అర్దం కాని సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. అయితే దిల్ రాజు చెప్పినట్లు ఎవరికి వాళ్లు చర్చించుకుని ముందుకు వెళ్లి సమస్య లేకుండా చూసుకుంటారు. అయితే వాల్తేరు వీరయ్యకు సాయిం చేయటానికి అల్లు అరవింద్, నాగ్ సీన్ లోకి వచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

నాగార్జునకు చెందిన అన్నపూర్ణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ కు తెలుగు రాష్ట్రాల్లో  చాలా ఏరియాల్లో మంచి గ్రిప్ ఉంది. వాళ్లు వాల్తేరు వీరయ్యకు థియేటర్స్ విషయంలో హెల్ప్ చేస్తున్నట్లు సమాచారం. మరో ప్రక్క చిరంజీవి బావ అయిన అల్లు అరవింద్ సైతం సీన్ లోకి వచ్చారని చెప్తున్నారు. అరవింద్ కు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ తరుపున చాలా థియేటర్స్ లీజ్ కు ఉన్నాయి. దాంతో ఆ థియేటర్స్ ని వీరయ్యకే కేటాయించబోతున్నారట. ఇవన్నీ చూస్తూంటే వీరసింహా రెడ్డి కు థియేటర్స్ విషయంలో చాలా టఫ్ కాంపిటేషన్ నడిచేటట్లు ఉందంటున్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల కాంబినేషన్ లో రూపొందిన భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' . ఈ సినిమాను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని  భారీగా ప్రమోట్ చేస్తున్నారు నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు.

ఇక ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. పవర్ ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ పాత్రను పవర్ ప్యాక్డ్ గా పరిచయం చేస్తూ  ఫస్ట్ లుక్ , టీజర్ను విడుదల చేశారు మేకర్స్. బిల్డ్-అప్ షాట్ లు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చాయి. 

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండ  రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. 

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. సినిమా సెన్సార్ కూడా  పూర్తయింది.  వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios