టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఈ రోజు ప్రత్యేకమైన రోజు. తన కొడుకు అల్లు అయాన్ (Allu Ayaan) పుట్టిన రోజు కావడంతో ఓ మెమోరబుల్ పిక్ ను షేర్ చేశాడు.  అయాన్ అంటే తనకెంత ఇష్టమో బయటపెట్టాడు బన్నీ.. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు తన కూతురు అల్లు అర్హా.. కొడుకు అల్లు అయాన్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఏమాత్రం షూటింగ్ గ్యాప్ వచ్చినా తన కూతురు, కొడుకుతో గడిపేందుకు సమయం కేటాయిస్తుంటాడు. వారితో సరదాగా ఉంటున్న క్షణాలను కెమెరాలో బంధించి, అభిమానులతోనూ పంచుకుంటుంటాడు బన్నీ. అయితే ఎక్కువ సార్లు అల్లు అర్జున్ తన ముద్దుల కూతురు అల్లు అర్హా (Allu Arha)తోనే నెట్టింట కనిపిస్తుంటాడు. అర్హాపైనే ప్రేమను కురిపిస్తూ పలు వీడియోలు, ఫొటోలను షేర్ చేసుకున్నాడు. 

అల్లు అయాన్ తో కూడిన వీడియోలను బన్నీ చాలా అరుదుగా రివీల్ చేస్తుంటాడు. ఏదేమైనా బన్నీకి తన కొడుకు అయాన్ అంటే ఎంత ఇష్టమో ఈ రోజు బయటపెట్టాడు. అయాన్ 8వ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ గుండెల నిండా దాచుకున్న ప్రేమను ఇన్ స్టా ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా హార్ట్ ఫెల్ట్ నోట్ రాసుకొచ్చాడు బన్నీ. ‘నా జీవితం, నా కొడుకు, నా మధురమైన ఆత్మ అయాన్‌ చాలా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాలి. రాబోయే రోజులు అయాన్ జీవితంలో ఆనందాన్ని, ప్రేమను, నవ్వును తీసుకురావాలి ఆకాంక్షిస్తున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు అయాన్’ అంటూ రాసుకొచ్చాడు అల్లు అర్జున్. 

ఈ సందర్భంగా ఓ మెమోరబుల్ పిక్ ను కూడా షేర్ చేసుకున్నాడు బన్నీ. ఫొటోలో బన్నీ పుష్ప (Pushpa) గెటప్ లోనే ఉన్నాడు. అయాన్ మాత్రం ‘వింగ్ మ్యాన్’ అనే హెడ్ బ్యానర్ ధరించి... తండ్రి ప్రేమను అనుభూతి చెందుతూ కనిపిస్తున్నాడు. అయితే ఇలా అల్లు అర్జున్, అయాన్ కలిసి ఉన్న ఫొటోలను బన్నీ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. అంతకు ముందు ఇంట్లో అయాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరిపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అల్లు స్నేహా (Allu Sneha) అయాన్ పుట్టిన రోజు వేడుకల ఫొటోలను తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

View post on Instagram