ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిరుచికి తగ్గట్లుగా హైదరాబాద్ అమీర్ పేటలో అధునాతన సౌకర్యాలు, హంగులతో AAA సినిమాస్ మల్టిప్లెక్స్ ని నిర్మించిన సంగతి తెలిసిందే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిరుచికి తగ్గట్లుగా హైదరాబాద్ అమీర్ పేటలో అధునాతన సౌకర్యాలు, హంగులతో AAA సినిమాస్ మల్టిప్లెక్స్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. జూన్ 15న అల్లు అర్జున్ స్వయంగా AAA సినిమాస్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని కూడా హాజరైన సంగతి తెలిసిందే. 

జూన్ 16 నుంచి AAA సినిమాస్ లో ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం ప్రదర్శించబడుతోంది. అయితే తొలిసారి అల్లు అర్జున్ తన సొంత మల్టి ఫ్లెక్స్ లో థియేటర్ ఎక్స్పీరియన్స్ ని ఆస్వాదించాడు. ఆదిపురుష్ చిత్రాన్ని AAA సినిమాస్ లో బన్నీ.. మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలసి చూశాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఈ దృశ్యాల్లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా కనిపిస్తోంది. త్రివిక్రమ్ తో కలసి అల్లు అర్జున్ ఆదిపురుష్ గ్రాండ్ విజువల్స్ ని ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉండగా అల్లు అరవింద్ AAA సినిమాస్ పాపులారిటీ పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. AAA సినిమాస్ ని సందర్శించాల్సిందిగా టాలీవుడ్ సెలెబ్రెటీలకు ఇన్విటేషన్ పంపుతున్నారు. 

Scroll to load tweet…

ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబుని ఇన్వైట్ చేస్తూ లెటర్ పంపారు. ఈ ఇన్విటేషన్ లెటర్ ని నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బన్నీకి, అల్లు అరవింద్ కి కృతజ్ఞతలు తెలిపారు. సమయం దొరికినప్పుడు తప్పకుండా AAA సినిమాస్ ని విజిట్ చేస్తానని నాగబాబు అన్నారు. ప్రస్తుతం నాగబాబు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

View post on Instagram