స్టార్ సినిమాల్లో  హీరోలకు ఎంత ప్రయారిటీ ఉంటుందో..సపోర్టింగ్ పాత్రలు చేసే వాళ్లకు అంతకు మించి ఉంటుంది. దాంతో ఆ సపోర్టింగ్ పాత్రలకు కూడా స్టార్స్ నే సీన్ లోకి తెస్తూంటారు. తమిళం నుంచి సత్యరాజ్, శరత్ కుమార్ ..కన్నడ నుంచి ఉపేంద్ర,సుదీప్ , మళయాళం నుంచి మోహన్ లాల్ , ముమ్మట్లి ఇలా తీసుకురాబడేవాళ్లే. 

దానికి తోడు మార్కెట్ పెరగటంతో...వాళ్లను తీసుకుంటే వాళ్లు వెలిగే ప్రాంతాల్లో బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. కన్నడ కూడా ఇప్పుడు తెలుగుకు మార్కెట్ గా మారిన నేపధ్యంలో అక్కడ హీరోలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా సుదీప్, ఉపేంద్రలకు తెలుగునాట మార్కెట్ ఉండటం కలిసొచ్చే అంశం.

దాంతో రీసెంట్ గా ఉపేంద్రను ..మహేష్ బాబు సినిమా కోసం అడిగారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రం కోసం ఉపేంద్రను సంప్రదిస్తే తనకు డేట్స్ ఖాళీ లేవని నో చెప్పేసారు. అంత ప్రెస్టేజియస్ ప్రాజెక్టు వదలుకోవటం బాధగా ఉందని కూడా ఉపేంద్ర అన్నారు. అయితే తాజాగా ఆయన్ని అల్లు అర్జున్ చిత్రం కోసం అడుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్, ఉపేంద్ర కాంబినేషన్ లో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం వచ్చి హిట్టైంది. 

ఇప్పుడు అదే కాంబినేషన్ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కోసం మళ్లీ ఉపేంద్రనే అడగాలని డిసైడ్ అయ్యారట. త్రివిక్రమ్ ఆ పాత్ర కోసం సుదీప్ ని అడుగాదమని అన్నా.. అల్లు అర్జున్ మాత్రం ఉపేంద్ర అయితేనే ఫెరఫెక్ట్ అని చెప్పారట.  అది కూడా తండ్రి పాత్రకు అని తెలుస్తోంది. అయితే పొలిటికల్ బిజీలో ఉన్న ఉపేంద్ర ఒప్పుకుంటాడా అంటే..అవసరమైతే..ఆయన కోసం కొద్ది రోజులు ఆగటానికి కూడా రెడీ అన్నట్లుగా చెప్తున్నారట. మరి ఉపేంద్ర ఏమంటారో చూడాలి.