టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ముందుగానే అభిమానులకు ఓటు వేయమని చెప్పిన సెలబ్రెటీలు ఉదయాన్నే లేచి మొదటి పనిగా దాన్ని పూర్తి చేశారు. ఉదయం 6:50 నిమిషాలకు దర్శకదీరుడు రాజమౌళి ఓటు వేశారు. 

ప్రతి పోలింగ్ బూతు దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు, ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓటు వేశారు. చాలా వరకు సెలబ్రటీలు ఉదయాన్నే వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నాగార్జునఎం నితిన్ వెంకటేష్ ఇంకా పలువురు సీనియర్ హీరోలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి వివరాలని తెలుసుకొని బాధ్యతగా వారి ఓటును వేస్తున్నారు.    

మొత్తంగా 119 నియోజకవర్గాల్లో ఎన్నికల సిబ్బంది 32,185 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.