సినీ నటుడు, గోరఖ్ పూర్ ఎంపీ రవి కిషన్ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వార్తల్లో నిలిచాడు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోరఖ్ పూర్ నుంచి బీజేపీకి తరుపున రవి కిషన్ ఎంపీగా గెలుపొందారు. తాజాగా రవి కిషన్ తన ప్రసంగంతో లోక్ సభలో ఆకట్టుకున్నారు. ఇండియాలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు భోజ్ పురి భాషను మాట్లాడగలరని తెలిపారు. 

అలాంటి భోజ్ పురి భాషని ఇంతవరకు రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ లో చేర్చకపోవడంపై రవి కిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఇటీవల వారణాసిలో భోజ్ పురి భాషలో మాట్లాడి అలరించారు. మోడీ మాటలతో తమ భాషకు రాజ్యాంగంలో ప్రాధాన్యత దక్కుతుందనే నమ్మకం కలిగినట్లు రవి కిషన్ తెలిపారు. 

లోక్ సభలోనే రవికిషన్ భోజ్ పురిలో పాట పాడి అలరించారు. తమ ప్రజల మనోభావాలకు అనుగుణంగా భోజ్ పురిలో ప్రాధాన్యత కల్పించాలని మోడీని రిక్వస్ట్ చేశాడు. అల్లు అర్జున్ సూపర్ హిట్ చిత్రం రేసు గుర్రంలో విలన్ గా రవికిషన్ మెప్పించిన సంగతి తెలిసిందే. సుప్రీం చిత్రంలోనూ రవి కిషన్ నటించారు.