స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తరువాత ఫ్యాన్స్ కి సరికొత్త కిక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల.. వైకుంఠపురములో అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబందించిన స్పెషల్  టీజర్ ని ఇటీవల రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో సర్ ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేసింది. 

వినాయక చవితి సందర్భంగా ఒకరోజు ముందే సినిమా టైటిల్ తో డిఫరెంట్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఆదివారం ఉదయం 9గంటలకు సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ విడుదల కానున్నట్లు టైమ్ కూడా ఫిక్స్ చేశారు. నా పేరు సూర్య సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న బన్నీ ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నాడు. 

ఇక త్రివిక్రమ్ కూడా గత సినిమాలతో అభిమానులను అనుకున్నంతగా మెప్పించలేకపోయారు. దీంతో ఆయనకు ఈ సినిమా కీలకం కానుంది. సినిమకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. గీత ఆర్ట్స్ - హారిక హాసిని ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.