నిర్మాత బర్త్ డే వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అన్నా నీ లుక్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వైట్ ప్రింటెడ్ షర్ట్ ధరించిన అల్లు అర్జున్ అల్ట్రా సైలిష్ గా దర్శనం ఇచ్చారు. ఇక పుష్ప మూవీ పాత్ర కోసం అల్లు అర్జున్ జుట్టు, గెడ్డం బాగా పెంచిన విషయం తెలిసిందే.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. చావు కబురు చల్లగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ చంద్ర నాయడు పుట్టిన రోజు నేపథ్యంలో గత రాత్రి ఆయన, వేడుకలో సందడి చేశారు. అల్లు అరవింద్, అల్లు శిరీష్ మరియు అల్లు వెంకట్ కూడా ఈ బర్త్ డే పార్టీలో పాల్గొనడం విశేషం. బర్త్ డే కేక్ కట్ చేయడంతో పాటు, ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ సరదాగా గడిపారు. 


ఇక వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అన్నా నీ లుక్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వైట్ ప్రింటెడ్ షర్ట్ ధరించిన అల్లు అర్జున్ అల్ట్రా సైలిష్ గా దర్శనం ఇచ్చారు. ఇక పుష్ప మూవీ పాత్ర కోసం అల్లు అర్జున్ జుట్టు, గెడ్డం బాగా పెంచిన విషయం తెలిసిందే. 


దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రంగా పలు బాషలలో పుష్ప విడుదల కానుంది. గంధం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 


ఈ మూవీ తరువాత దర్శకుడు కొరటాల శివ మూవీలో అల్లు అర్జున్ నటించనున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా భారీగా నిర్మితం కానుందని సమాచారం. ఇక ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్ అల్లు అర్జున్ ని కలవడం జరిగింది. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రానుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.