ఉగాది పండుగ.. పైగా ఆదివారం సందర్భంగా నిన్న కంప్లీట్ గా సెలవు తీసేసుకున్నాడు అల్లు అర్జున్. ఉదయాన్నే ట్విట్టర్ ద్వారా అభిమానులను పలకరించి 'విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు' అంటూ విషెస్ కూడా చెప్పాడు. సోషల్ మీడియాలో అంత చురుకుగా పార్టిసిపేట్ చేయని బన్నీ.. నిన్న బాగా టైం కేటాయించినట్లుగా ఉన్నాడు.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో బ్లూమ్ బెర్గ్ వారి టాప్ 10 సిటీస్ ఇన్ ది వరల్డ్ కు రిప్లై ఇస్తూ.. అందులో 3వ ర్యాంక్ మిస్ అయిందంటూ రిప్లై పెట్టాడు. "టైపో మిస్టేక్ కరెక్ట్ చేసుకోండి. జ్యూరిచ్ కు 3వ ర్యాంక్ వస్తుందని నా నమ్మకం" అంటూ ట్వీట్ పెట్టాడు. నిజానికి పారిస్ తో కలిపి జ్యూరిచ్ కు 2వ ర్యాంకును అందించారు. ఈ విషయాన్ని గమనించాడో లేదో తెలీదు కానీ.. టైపో ఎర్రర్ అంటూ ట్వీట్ చేసేశాడు బన్నీ. ఆ తర్వాత మరో నిమిషానికే.. 7వ ర్యాంక్ కూడా కనిపించడం లేదని అన్నాడు బన్నీ. జెనీవా.. సియోల్ లకు కలిపి 6వ ర్యాంక్ ను ఉమ్మడిగా ఇచ్చారు. ఇలా కామన్ ర్యాంక్ లు ఇచ్చినపుడు తర్వాతి ర్యాంక్ ఉండదనేది చాలా సింపుల్ విషయమే.

ఈ మాత్రం కూడా తెలియదా బన్నీ అంటూ నెటిజన్లు ట్రాలింగ్ చేసేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ కు అయితే అల్లు అర్జున్ ను విమర్శలు చేసేందుకు మరో ఆయుధం దొరికింది. కానీ ఈ రిప్లైస్ ను డిలెట్ చేసే ఉద్దేశ్యం కూడా బన్నీకి ఉన్నట్లుగా లేదు. మరి అసలు విషయం తెలిసి కామెడీ చేశాడా.. లేకపోతే నిజంగానే విషయం తెలియక ట్వీట్ స్లిప్ అయ్యాడా అని చెప్పలేం కానీ.. జనాలకు మాత్రం పండుగ రోజున పులిహోర మ్యాటర్ ఒకటి దొరికేసింది.