అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ స్టోరీకి సంబంధించి మతిపోయే విషయాలు లీక్ అయ్యాయి.  

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. `జులాయి`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `అల వైకుంఠపురములో` చిత్రాలతో బ్లాక్‌ బస్టర్స్ అందుకున్నారు. దీంతో వీరిది హిట్‌ కాంబోగా నిలిచింది. చివరి మూవీ `అల వైకుంఠపురములో` ఇండస్ట్రీలోనే అప్పటి వరకు నాన్‌ `బాహుబలి` రికార్డులను బ్రేక్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్‌ కాబోతుంది. ఇప్పటికే దీన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీ ఉంటుందా? లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. క్యాన్సిల్‌ అయ్యిందనే ప్రచారం కూడా జరుగుతుంది. 

కానీ తాజాగా నిర్మాత బన్నీవాసు కన్ఫమ్‌ చేశాడు. `ఆయ్‌` ఈవెంట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమాని తెరకెక్కించబోతున్నట్టు తెలిపారు. భారీ బడ్జెట్‌తో సినిమాని తీయబోతున్నారట. ఇప్పటి వరకు టచ్‌ చేయని జోనర్‌లో ఈ మూవీ ఉండబోతుందట. త్రివిక్రమ్‌ మొదటిసారి ఇలాంటి జోనర్‌ టచ్‌ చేస్తున్నాని అంటున్నారు. అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ మైథలాజికల్‌ టచ్‌తో ఉంటుందని తెలుస్తుంది. పురణాలకు సంబంధించిన అంశాలను, సోషల్‌ డ్రామాతో ముడిపెట్టి తెరకెక్కించబోతున్నారట. `కల్కి`, `బింబిసార`, `జగదేక వీరుడు అతిలోక సుందరి` తరహా జోనర్‌లో ఉంటుందని తెలుస్తుంది. `పుష్ప2`లో బన్నీ అమ్మోరుగా కనిపిస్తేనే పూనకాలు తెప్పిస్తుంది. అలాంటిది మైథలాజికల్ మూవీ అంటే ఇక ఊగిపోవాల్సిందే. 

రైటింగ్ లో త్రివిక్రమ్‌కి మించిన రైటర్‌ లేరని అంటుంటారు. ఆయన ఈ మూవీని చాలా స్ట్రాంగ్ గా రాస్తున్నాడట. ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని నిర్మాత బన్నీవాసు తెలిపారు. ప్రస్తుతం బన్నీ `పుష్ప2`లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌కి మరో నెల రోజులకుపైగానే పట్టే అవకాశం ఉంది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లారు. ఈ మూవీ కంప్లీట్‌ చేశాక, త్రివిక్రమ్‌ సినిమాకి షిఫ్ట్ అవుతాడట. ఈ లెక్కన బన్నీ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్‌ దే అని చెప్పకనే చెప్పారు బన్నీవాసు. గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే దీన్ని నిర్మించబోతున్నారు. 

ఇదిలా ఉంటే బన్నీ.. సందీప్‌ రెడ్డి వంగాతో ఓ మూవీ చేయాల్సి ఉంది. ప్రభాస్‌తో ఆయన చేయాల్సిన `స్పిరిట్‌` తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుందని సమాచారం. అలాగే నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమాకి బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అట్లీతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్‌ అయ్యిందని సమాచారం.