స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సినిమాపై అధికార ప్రకటన రాకపోవడంతో సినిమా క్యాన్సిల్ అయిందంటూ రకరకాల వార్తలు వినిపించాయి.

ఎట్టకేలకు ఈ సందేహాలన్నింటికీ తెర దించుతూ వీరి కాంబినేషన్ లో సినిమాను అనౌన్స్ చేశారు. హీరోగా అల్లు అర్జున్ కి ఇది 19వ సినిమా కాగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే మూడో సినిమా ఇది.

హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 2019 జనవరిలో సినిమా మొదలుకానుంది.