టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఇటీవల కాలంలో సరైన సక్సెస్ ని అందుకోలేకపోయాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'నా పేరు సూర్య' సినిమా కూడా ఫ్లాప్ కావడంతో డీలా పడ్డాడు.

తన తదుపరి సినిమా విషయంలో చాలా సమయం తీసుకొని త్రివిక్రమ్ ని ఓకే చేశాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తరువాతి ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టినట్లు ఉన్నాడు అల్లు అర్జున్. 'రన్ రాజా రన్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సుజీత్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'సాహో' సినిమాను రూపొందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది ఇలా ఉండగా.. ఇటీవల అల్లు అర్జున్ ని కలిసిన సుజీత్ ఓ స్టోరీ లైన్ చెప్పాడట. లైన్ ఆసక్తికరంగా ఉండడంతో అల్లు అర్జున్ కూడా కథ సిద్ధం చేయమని చెప్పినట్లు సమాచారం.

అన్నీ కుదిరితే యువి క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'సాహో'తో సుజీత్ సక్సెస్ అందుకుంటే గనుక అల్లు అర్జున్ తో సినిమా చేయడం ఖాయమని తెలుస్తోంది.