అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే ఇప్పటివరకు హీరోయిన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

సాధారణంగా తన సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే నిర్ణయం బన్నీ తీసుకుంటూ ఉంటాడు. 'డీజే' సినిమా కోసం పూజా హెగ్డేని రంగంలోకి దింపింది, 'నా పేరు సూర్య'లో అను ఎమ్మాన్యుయల్ ని తీసుకోవాలని పట్టుబట్టింది అల్లు అర్జునే. అయితే త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్విషయం మాత్రం అతడికే వదిలేశాడు.

త్రివిక్రమ్ పలు హీరోయిన్లను అనుకుంటున్నప్పటికీ ఎవరిని ఫైనల్ చేయలేదు. లవ్ స్టోరీతో నడిచే సినిమా కావడం హీరోయిన్ డేట్స్ ఎక్కువగా కావాలి. భారీ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు. కాబట్టి బల్క్ డేట్స్ ఇచ్చే హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

ఈ క్రమంలో కియారా అద్వానీ పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు త్రివిక్రమ్ మరో హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నాడు. 'మహానటి' చిత్రంతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న నటి కీర్తి సురేష్ ని తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నాడు.

కథ ప్రకారం సినిమాలో హీరోతో సమానంగా హీరోయిన్ రోల్ కూడా ఉంటుందని చెబుతున్నారు. మరి కీర్తి సురేష్ ని ఫైనల్ చేస్తారో.. లేక మరో హీరోయిన్ ని తీసుకుంటారో చూడాలి!