ఫ్యాన్స్ కు ముందే చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్

First Published 21, Nov 2017, 8:12 PM IST
allu arjun surprises fans with sweet momery pic of arha
Highlights
  • సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ అల్లు అర్జున్ సొంతం
  • తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న అల్లు అర్జున్
  • అర్హ బర్త్ డే సందర్భంగా ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ ప్రారంభించిన బన్నీ

అల్లు అర్జున్ టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోగా ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో.  తాజాగా ఇనిస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే పేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా తన ఫాన్స్ కు దగ్గరగా ఉన్న బన్నీ... ఇప్పుడు వారికీ మరింత దగ్గరయ్యేందుకు సిద్ధం అవుతున్నాడు. 1.26 కోట్ల మంది ఫాలోవర్లు అల్లు అర్జున్ ఇప్పటికే పేస్ బుక్, ట్విట్టర్‌లో బోలెడు క్రేజ్ వుంది. ట్విట్టర్లోకి కొంచెం లేటుగా వచ్చినా 17 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఇప్పడు బన్నీ మరో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ ఇన్‌స్ట‌ాగ్రామ్‌లోకి కూడా వచ్చేశాడు.

 

ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఫొటో పెట్టడానికి బన్నీ ఒక ముహూర్తం కూడా చూసుకున్నాడు. ఈ రోజే అతను అక్కడ తొలి ఫొటో షేర్ చేసాడు. దీని గురించి ముందే ప్రకటన కూడా చేశాడు బన్నీ. మెమొరబుల్ ఫొటో ఒక ఙ్ఞాపకంగా మారే ఫొటోల్ని క్యాప్చర్ చేయడమంటే తనకెంతో ఇష్టమని.. ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఫొటోలతో తన జర్నీ 21వ తారీఖు మొదలు కానుందని.. ఒక మెమొరబుల్ ఫొటో ఒకటి ఆ రోజు షేర్ చేస్తానని బన్నీ తెలిపాడు.

 

మరి బన్నీ షేర్ చేసిన ఆ స్పెషల్ ఫొటో ఏదా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే తన కూతురు అర్హా ఫొటోతో అందరినీ సర్ప్రైజ్ చేసాడు బన్నీ. అల్లు వారి చిన్నారి అర్హకు లైకులే లైకులు వచ్చేసాయ్.

loader