స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజాగా చిత్రం నాపేరు సూర్య. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రచయిత వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. బన్నీ ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. దేశభక్తి ఉన్న ఆర్మీమాన్ గా బన్నీ సాహసాలు చేయబోతున్నాడు.యాక్షన్ భరిత చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ తో లవ్ ట్రాక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇటీవల చిత్ర రషెష్ గమనించిన బన్నీ అను ఇమ్మాన్యుయేల్ తో వచ్చే లవ్ ట్రాక్ ఎక్కువైనట్లు అనిపించిందట. సినిమాకు అది పెద్ద మైనస్ అవుతుందని బన్నీ డైరెక్టర్ కి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. రోమాంటిక్ సన్నివేశాలు కొన్నింటిని తొలగించాలని అల్లు అర్జున్ దర్శకుడికి సూచించినట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంతో మరో హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మే 4 న నాపేరు సూర్య చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.