`పుష్ప 2` టీమ్‌కి అల్లు అర్జున్‌ స్టిక్ట్ రూల్‌.. ఆ పని చేయాల్సిందేనట..?

`పుష్ప 2` సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. దర్శకుడు సుకుమార్‌ వేరే రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందానికి హీరో అల్లు అర్జున్‌ స్టిక్ట్ రూల్‌ పెట్టాడట. 

allu arjun Strict rule to pushpa 2 team for release arj

ఇండియన్‌ మోస్ట్ వాంటెడ్‌ మూవీస్‌లో `పుష్ప2` ఒకటి. ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. క్రియేటివ్‌ జీనియస్‌ సుకుమార్‌ రూపొందించారు. తొలి భాగం భారీ విజయాన్ని సాధించడంతో రెండో పార్ట్ ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు సుకుమార్‌. బడ్జెట్‌ పెంచారు. సినిమా స్కేల్‌ని పెంచారు. మరింత లావిష్‌గా తెరకెక్కిస్తున్నారు. 

ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సినిమా చివరి దశకు చేరుకుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇంకా చాలా షూటింగ్‌ పార్ట్ మిగిలి ఉందట. ఆ మధ్య క్లైమాక్స్ షూట్‌ చేస్తున్నారని అన్నారు. కానీ చాలా పార్ట్ షూట్‌ చేయాల్సి ఉందట. ఈ నేపథ్యంలో ఫాస్ట్ గా చిత్రీకరణ చేస్తున్నారట. అయితే షూటింగ్‌ విషయంలో బన్నీ చాలా కమిట్‌ మెంట్‌తో ఉన్నారట. సినిమాని అనుకున్న టైమ్‌కి విడుదల చేయాలని భావిస్తున్నారట. 

ఆగస్ట్ 15న విడుదల చేయాలని ప్రకటించిన నేపథ్యంలో ఆ టైమ్‌కే ఫిక్స్ కావాలని చెప్పాడట బన్నీ. ఈ మేరకు షూటింగ్‌ కంప్లీట్‌ చేసేలా టీమ్‌కి, సుకుమార్‌కి ఆదేశాలు జారీ చేశారట. ఈ మేరకు మధ్యలో గ్యాప్‌ లేకుండా చిత్రీకరణ జరపాలని తెలిపారట. ఎలాంటి బ్రేక్‌ లేకుండా చిత్రీకరణ చేయాలని, అనుకున్న టైమ్‌కే సినిమాని పూర్తి చేసి స్వాతంత్ర్య దినోత్సవానికి సినిమాని రిలీజ్‌ చేయాలని తేల్చి చెప్పారట. ఈ విషయంలో మార్పు లేదని బన్నీ సూచించినట్టు సమాచారం. ఈ మేరకే షూటింగ్‌ వేగంగా చేస్తున్నారని తెలుస్తుంది. 

బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా శ్రీ వల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా ఫహద్‌ ఫాజిల్‌ కనిపించనున్నారు. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో సునీల్‌, అనసూయ, రావు రమేష్‌లు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. `పుష్ప2` మూడో పార్ట్ కూడా ఉంటుందట. ఇటీవల బన్నీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీన్ని సిరీస్‌లాగా చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇక ఈ మూవీ బిజినెస్‌ లెక్కలు కూడా షాకిస్తున్నాయి. ఇండియాలోనే హైయ్యేస్ట్ బిజినెస్‌ జరుగుతుందని అంటున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios