అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. తనకి `ఆర్య`, `ఆర్య2` వంటి విజయాలను అందించిన సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. తాజాగా తన అభిమానులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బన్నీ. ఆయన నటిస్తున్న `పుష్ప` చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. `పుష్పరాజ్‌ వేట ఆగస్‌ 13 నుంచి ప్రారంభమవుతుంది` అని తెలిపింది యూనిట్‌.  

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 13న ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించారు. అయితే ఊహించని విధంగా ఈ సర్‌ప్రైజ్‌నిచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో ప్రస్తుతం `పుష్ప` యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. `సలార్‌` యాష్‌ ట్యాగ్‌ని మించి `పుష్ప` ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాని పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో బన్నీ పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో, విలన్‌ని పోలి ఉన్నాడు. ఈ ఫోటోలు వైరల్‌ అవుతుంది. బన్నీ లుక్‌ని సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు.

దీనిపై అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేస్తూ, `ఈ ఏడాది ఆగస్ట్ 13న థియేటర్లోకి వచ్చేందుకు `పుష్ప` లోడ్‌ అవుతుంది. ఈ ఏడాది మీ అందరిని థియేటర్‌లో కలవడానికి సంతోషిస్తున్నా. ప్రియమైన వారితో మరోసారి అదే మ్యాజిక్‌ క్రియేట్‌ చేయాలని ఆశిస్తున్నా` అని తెలిపారు. ఇందులో బన్నీ `పుష్పరాజ్‌` అనే పాత్రలో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని టాక్‌.