`పుష్ప పుష్పరాజ్ నీ అబ్బ తగ్గేదెలే` అంటూ చెప్పే డైలాగ్ వరల్డ్ వైడ్‌గా ఊపేస్తుంది.ఇప్పటికీ అనేక మంది రీల్స్ చేస్తున్నారు. తాజాగా `పుష్ప` సినిమాకి సంబంధించి మరో అరుదైన ఘనత అల్లు అర్జున్ ఖాతాలో చేరింది.
అల్లు అర్జున్(Allu Arjun) వరుస రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. `పుష్ప`(Pushpa)తో సంచలనం సృష్టించారు. ఆయన మ్యానరిజం దేశాలనే కాదు, ఖండాలను దాటిపోయింది. `పుష్ప పుష్పరాజ్ నీ అబ్బ తగ్గేదెలే` అంటూ చెప్పే డైలాగ్ వరల్డ్ వైడ్‌గా ఊపేస్తుంది.ఇప్పటికీ అనేక మంది రీల్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ డైలాగ్‌ని చెబుతూ మరింత పాపులారిటీని తీసుకొస్తున్నారు.
తాజాగా `పుష్ప` సినిమాకి సంబంధించి మరో అరుదైన ఘనత అల్లు అర్జున్ ఖాతాలో చేరింది. `పుష్ప` చిత్రంలోని పాటల ఆల్బమ్(Pushpa Album) ఐదు బిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల ఆల్బమ్ ఐదు బిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. అంటే ఏకంగా 500కోట్ల వ్యూస్ సాధించింది. ఇది ఇండియన్ మ్యూజిక్ చరిత్రలోనే రికార్డుగా నిలిచిందని చెప్పొచ్చు.
ఇందులో `దాక్కో దాక్కో మేక`, `ఏ బిడ్డా ఇది నా అడ్డా`, `శ్రీవల్లి`, `ఊ అంటావా మావ.. ఊఊ అంటావా` అనే పాటలున్న విషయం తెలిసిందే. ఇవన్నీ ఒక్కోటి వంద మిలియన్స్ ని మించి వ్యూస్‌ని రాబట్టుకోవడం విశేషం. అంతకు ముందు బన్నీ నటించిన `అల వైకుంఠపురములో` పాటలు కూడా దుమ్ములేపాయి. అవి ఒక్కోటి వంద మిలియన్స్ దాటడం విశేషం. ఇలా బ్యాక్ టూ బ్యాక్ బన్నీ సినిమాల ఆల్బమ్ అత్యధిక వ్యూస్‌ని రాబట్టుకోవడం మరో విశేషం.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సినిమా డిసెంబర్ 17న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో నాన్ `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్` రికార్డులను క్రియేట్ చేసింది. ఏకంగా రూ.350కోట్లు వసూలు చేయడం విశేషం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటించారు. `ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మావ`లో సమంత స్టెప్పులేయడం విశేషం.
ప్రస్తుతం ఈ సినిమాకి రెండో పార్ట్ ని తెరకెక్కించే పనిలో ఉన్నారు సుకుమార్. కథని మరింత బలంగా డిజైన్ చేస్తున్నారు. దీన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. రెండో పార్ట్ లో భారీతారాగణం యాడ్ కాబోతుందని టాక్. విజయ్ సేతుపతిని కూడా తీసుకోబోతున్నారట. అదే సమయంలో పాన్ ఇండియాని మించి ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
