అభిమానిని చూసి చలించిపోయిన అల్లు అర్జున్, దగ్గరకు వచ్చిమరీ ఆటోగ్రాఫ్ ఇచ్చిన బన్ని
తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఒక్కోసారి తానే స్యయంగా అభిమానుల చెంతకు వస్తుంటాడు. తాజాగా ఓ అభిమాని పడుతున్న ఇబ్బందిని గమనించిన ఐకాన్ స్టార్ స్వయంగా వెళ్ళి సర్ ప్రైజ్ ఇచ్చాడు.

తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఒక్కోసారి తానే స్యయంగా అభిమానుల చెంతకు వస్తుంటాడు. తాజాగా ఓ అభిమాని పడుతున్న ఇబ్బందిని గమనించిన ఐకాన్ స్టార్ స్వయంగా వెళ్ళి సర్ ప్రైజ్ ఇచ్చాడు.
ప్రస్తుతం పుష్ప..2 సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్ (Allu Arjun).పుష్పతో జాతీయ అవార్డ్ సాధించిన అల్లు అర్జున్.. ఇక పుష్ప2 సినిమాతో ఈసారి ఆస్కార్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి పుష్ప సినిమాలతో దేశవ్యాప్తంగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. బన్నీ ఎక్కడ కనిపించినా సరే అభిమానులు ఆటోగ్రాఫ్స్, సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు.
అయితే అందరు స్టార్ల మాదిరిగా అభిమానులకు కాస్త డిస్టెంన్స్ మెయింటేన్ చేయకుండా..అభిమానులకు కూడా కలుపుకుపోతుంటాడు బన్నీ. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌తో చాలా సరదాగా ఉంటారు. వారికి ఆటోగ్రాఫ్స్ ఇస్తూ అభిమాలను అలరిస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్ ఓ చిన్నారి అభిమాని దగ్గరకు వెళ్ళి మరీ.. అడగ్గానే వెంటనే ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
జాతీయ అవార్డు అందుకునేందుకు బన్నీ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ విమానాశ్రయంలో చక్రాల కుర్చీలో ఉన్న చిన్నారి అభిమానిని చూసిన అల్లు అర్జున్ చలించిపోయారు. తానే స్యయంగా ఆ చిన్నారి వద్దకు వెళ్లి సరదాగా కాసేపు మాట్లాడారు. చిన్నారి పేరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.కాగా, పుష్ప.. ది రైజ్ సినిమాలో తన అత్యుత్తమ నటనకు గానూ బన్నీ ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈరోజు (అక్టోబర్ 17) ఢిల్లీలో జరగబోయే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించనున్నారు. తెలుగులో మొదటి సారి ఉత్తమ హీరోగా జాతీయ అవార్డ్ సాధించి రికార్డ్ సాధించాడు అల్లు అర్జున్.